ధరూర్, డిసెంబర్ 17 : జూరాల ప్రాజెక్ట్‌కు స్వల్ప వరద కొనసాగుతున్నది. 231 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 439 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమో దైంది. కుడి కాల్వకు 351క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, 88 క్యూసెక్కుల నీరు అవిరి అవుతున్నది. ప్రాజెక్ట్ నీటిమట్టం 7.609టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.902 టీఎంసీల నీటిమ ట్టం ఉన్నది. ప్రాజెక్ట్ నీటిసామర్థ్యం , 1045 అడుగులకు గానూ ప్రస్తుతం 1,041.601 అడుగుల నీటిమట్టం నిల్వ ఉన్నది.
అయిజ, డిసెంబర్ 17 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటి నిల్వ 6.2 అ డుగులకు చేరుకున్నది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్టలో నీటిమట్టం తగ్గుతోంది. ఆదివా రం ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోగా, ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 313 క్యూసెక్కులు విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 6.2 అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. తు మ్మిళ్ల పథకం పంప్ ద్వారా నీటి వి డుదల కొనసాగుతుందని పేర్కొన్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోగా, అవుట్‌ఫ్లో 1,916 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన డ్యాంలో ప్రస్తుతం 11.431 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. 1,633 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి గానూ ప్రస్తుతం 1,590.47 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.