మహబూబ్‌నగర్, మే 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణానదికి వరద పోటెత్తింది. జూరాల ప్రా జెక్టు నిండిపోవడంతో గురువారం సాయంత్రం 12 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడు దల చేశారు. ఎగువ నుంచి అర్ధరాత్రి వరకు లక్ష క్యూసెక్కులు దాటుతుందని, మరిన్ని గేట్లు ఎత్తివేసే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు తుంగభద్రా నదికి కూడా వరద పోటెత్తడంతో సుమారు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
సుంకే సుల డ్యాం నిండిపోవడంతో మధ్యాహ్నం 3గేట్లు, సాయంత్రానికి ఒక గేటు ఎత్తారు. ఉమ్మడి మహబూ బ్‌నగర్ జిల్లాలో రుతుపవనాల ప్రభావంతో నాలుగు రోజుల నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నారాయణపేట, గద్వాల జిల్లా లలో రెండు జీవనదులు పొంగిపొర్లు తుండ డంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వానకాలం ప్రారంభం కాకముందే ప్రధాన నదులకు వరద పోటెత్తడం ఇదే తొలిసారి. ఇటు కృష్ణ, అటు తుంగభద్ర నదుల నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని శ్రీశైలానికి వదులు తు న్నారు. శుక్రవారం నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
నారాయణపేట జిల్లా తంగిడి వద్ద కృష్ణానది తెలం గాణలోకి ప్రవేశిస్తుంది. ఇటీవల కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో నాలుగు రోజుల నుంచి కృష్ణానదికి స్వల్పంగా నీరు వచ్చి చేరుతున్నది. వరద క్రమేపీ పెరుగుతుండడంతో జూరాల ప్రాజెక్టు గంటల్లోనే నిండిపోయింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు సాయంత్రం 12గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మరోవైపు రేపటి వరకు లక్ష క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, మరిన్ని గేట్లు ఎత్తివేస్తామన్నారు.
కృష్ణమ్మకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో అటు తుంగభద్రా నదికి కూడా వరద పోటెత్తితోంది. వారం రోజుల నుంచి ఎగువ కర్ణాటకలో భారీ వర్షాలు కురు స్తున్న నేపథ్యంలో ఆర్డీఎస్ వద్ద 15,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో సుంకేసుల వద్ద మూడు గేట్లు ఎత్తివేశారు. సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్ట డంతో ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడు దల చేస్తున్నారు. ప్రస్తుతం తుం గభద్ర కు ఇన్ ఫ్లో 6000 క్యూసెక్కులు గా నమోదైంది. కాగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని రెండు నదులకు వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణ తుంగభద్ర నదులు పోటెత్తుతుండడంతో శ్రీశైలానికి లక్ష క్యూసె క్కులను వదులుతున్నారు. కృష్ణ నుంచి 82,000, తుంగభద్ర నుంచి 15000 పైచిలుకు క్యూసెక్కుల వరద నీరు చేరుతూ ఉండడంతో శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూ డా భారీ వర్షాలు నమోదవు తున్నాయి.
నారాయణపేట, జో గుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జి ల్లాలో కృష్ణా నది పరివాహక ప్రాం తాల ప్రజలు అ ప్రమత్తంగా ఉం డాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేప థ్యంలో కృష్ణా నదికి వరద పెద్ద ఎత్తున తరలి వస్తుంది. శుక్రవారానికి మరింత పెరిగే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతంలోని గ్రామాల ప్రజలతోపాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. జూరాల ప్రాజెక్టు కూడా అంత కంతకూ వరద పెరుగుతుండడంతో బ్యాక్ వాటర్‌లో దిగవద్దని సూ చిస్తున్నారు. వరద వస్తున్న నేపథ్యంలో కృష్ణ మండ లంలో రెవెన్యూ యంత్రాంగం నదీ పరీవాహక ప్రాంతా లను పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎండా కాలం చివర్లో వర్షాకాలం ప్రారం భం కాకముందే రెండు నదులు ఉప్పొంగడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతు న్నది.