గద్వాల, జూన్ 20 : ఎగువన వర్షాలు భారీగా కురుస్తుండడంతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు 58,722 క్యూసెక్కు నీటిని విడుదల చేస్తున్నారు. అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు 84,000 వేల క్యూసెక్కుల వదర నీరు వచ్చి చేరుతున్నది.
జూరాలకు వరద కొనసాగుతుండగా విద్యుత్ ఉత్పత్తికి 31,852 క్యూసెక్కులు, భీమా-1కు 650, కోయిల్‌సాగర్ లిఫ్టుకు 315, కుడి కాల్వకు 340 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 84000 క్యూసెక్కులు ఉండగా మొత్తం అవుట్ ఫ్లో 91,944గా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7,681 టీఎంసీల నీరు నిలువ ఉన్నది.