మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 30 : బీఆర్ఎస్ శ్రేణుల సంబురం మిన్నంటింది. ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంపై హర్షం వ్యక్తమైంది. గులాబీ పార్టీ నేతల పోరాటంతోనే ప్రజలకు కరెంట్ చార్జీల పెంపు ముప్పు తప్పిందని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటాకులు కాల్చారు.. ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ పార్టీ విజయమని నినదించారు. కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సంబురాలు జరుపుకొన్నారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య,మక్తల్, జడ్చర్లలో హర్షం వ్యక్తం చేశారు.
విద్యుత్ భారాన్ని మోపనియ్యం
విద్యుత్ చార్జీల భారాన్ని ప్రజలపై మోపనీయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా బీఆర్ఎస్ కట్టిడి చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ వినియోగదారులపై రూ. 18వేల కోట్ల విద్యుత్ భారం పడకుండా, చార్జీలు పెంచకుండా పోరాడి అడ్డుకున్న ఘన త బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు.
సంక్షేమం, అభివృద్ధి చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ష్‌న్ పాలిటిక్స్ చేస్తూ ప్రజావ్యతిరేకతకు పాల్పడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఏనాడు విద్యుత్ చార్జీలు పెంచలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయని, వాటిని అమలు అడిగిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టడం దారు ణమన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, రైతు చనిపోతే రైతు బీమాకు దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన పదినెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటకట్టుందన్నారు. ఎస్టీ, ముదిరాజ్, మంగలి, చాకలి కులస్తులకు మంత్రి పదవులు, నామినేటేడ్ పదవులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
50 ఎకరాల్లో జేఎన్టీయూ క్యాంపస్ తీసుకొ చ్చామని వాటి పనులు మొదలవ్వలేదు.. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు మా ప్రభుత్వంలో చేసిన పనుల వరకే ఆగిపోయాయన్నారు. ప్రభుత్వ నూతన దవాఖాన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాలులోకి తేవాలని, బస్టాండ్ నుంచి దవాఖాన వరకు లిఫ్టుకు కోటి రూపాయలు, ఏకోపార్క్ అభివృద్ధికి నిధులు మం జూరయ్యాయని వాటిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని లేదంటే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామ ని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, గ్రం థాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, శివరాజ్, దేవేందర్‌రెడ్డి, కరుణకర్గౌడ్, లక్ష్మ య్య, ఆంజనేయులు, అహ్మదుద్దీన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.