బాలానగర్: ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మరని, సరైన సమయంలో వారికి ప్రజలే బుద్ది చెబుతారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబా ద్లోని తెలంగాణ భవన్లో మండలంలోని నేరళ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ ఖలీల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గుటాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షాల మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమం టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతిపక్ష నాయకుల కల్లబోల్లి మాటలు ప్రజలు నమ్మర ని, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని అన్నారు. కార్యక్ర మంలో ఎంపీటీసీ అభిమాన్యురెడ్డి, సింగిల్విండో డైరెక్టర్ మంజునాయక్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుండెడ్ చెన్నారెడ్డి, నాయకులు శేఖర్, మల్లేశ్, తిరుపతి, తదితరులు ఉన్నారు.