బాలానగర్, ఆగస్టు 23 : కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్ముకుంటే బతుకులు చీకటి పాలవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. వైస్ ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 20మంది హైదరాబాద్‌లో బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోనే బీఆర్ఎస్కు ఆదరణ లభిస్తోందని, వాటికి ఆకర్షితులయ్యే అన్ని పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకూ పథకాలు అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు.
అంతకుముందు మండలంలోని ఆప్పాజిపల్లి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ వర్కింగ్ మండల ప్రెసిండెంట్ బాలునాయక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డిని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సింగిల్ విండో డైరెక్టర్ మంజూనాయక్ ఎమ్మెల్యేని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో గణేశ్‌గౌడ్, ప్రేమ్, అనీల్, శేఖర్, సత్యంతోపాటు తదితరులున్నారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాసరావు, మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, కార్మిక విభాగం మండలాధ్యక్షుడు యాదయ్య, ఎస్టీసెల్ మండల ఉపాధ్యక్షుడు రమేశ్‌నాయక్, వైస్ ఎంపీపీ వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.
రాజాపూర్, ఆగస్టు 23 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెం దిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కుర్వపల్లికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మిడ్జిల్, ఆగస్టు 23 : మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు 20మంది హైదరాబాద్‌లో ఎమ్మెలే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సుధాబాల్రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలు, బాలకృష్ణ, శేఖర్, శ్రీనివాస్, గోపాల్, జగన్ పాల్గొన్నారు.