మహబూబ్‌నగర్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రజా ఆశీర్వాదం కోసం జననేత, గులాబీ బాస్ కేసీఆర్ రానున్నారు. సోమవారం మూడు జిల్లాల్లో నాలుగు సభలు హోరెత్తనున్నాయి. దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, గద్వాలలో భారీ బహిరంగ సభలకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. పెద్ద మొత్తంలో జనసమీకరణ చేపట్టి టూర్‌ను విజయవంతం చేసే పనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. కార్యక్రమాలు ‘న భూతో.. నా భవిష్యత్’ అన్న చందంగా నిర్వహించాలన్న పట్టుదలలో నేతలు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి వరుస సభలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇప్పటికే సీనియర్ నేతల చేరికతో కారు జోరు మీదుండగా.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం స్పీడ్‌ను అందుకోలేక చతికిలబడ్డాయి. ఈ ఎన్నికల్లోనూ గత ఫలితాలు రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు, నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత.. ప్రగతి ప్రధాత సీఎం కేసీఆర్ ఈనెల 6న ఉమ్మడి జిల్లాలో ఒకేరోజు మూడు జిల్లాల్లో, నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఒకే రోజు నాలుగు చోట్ల ప్రజాఆశీర్వద సభల్లో పాల్గొంటుండడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. నామినేషన్ల ఘట్టం ఊపందుకున్న తరుణంలో పార్టీ అధినేత పర్యటనను ప్రతిష్టాత్మంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్డ్ ప్రకటించాగానే గత నెల 18న జడ్చర్ల పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొని ఉమ్మడి జిల్లాలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అదే నెల 26న అచ్చంపేట, వనపర్తి నియెజకవర్గాల్లో పర్యటించి రాజకీయ వేడిని రగిలించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర, జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో, నారాయణపేట జిల్లా కేంద్రంతోపాటు మక్తల్‌లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకే రోజుల నాలుగు సభల్లో గులాబీ పార్టీ అధినేత అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తుండడంతో పార్టీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే సభలు నిర్వహించే స్థలాలను చదును చేసి హెలీప్యాడ్‌కు ఏర్పాట్లు ఫైనల్ చేశారు. నాలుగు చోట్ల పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార సభలను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు సీఎం సభకు జనసమీకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులు, ఇన్చార్జీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మండలాల వారీగా భారీఎత్తున కార్యకర్తలను తరలించేందుకు వాహనాలు, ఇతరాత్ర ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ జాబితాలు ప్రకటించడం.. అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడడంతో సీనియర్ నా యకులంతా గులాబీ దళంలో వచ్చి చేరుతుండడంతో అన్ని నియెజకవర్గాల్లో జో ష్ కనిపిస్తున్నది. విపక్షాలకు దిమ్మతిరిగే లా సీనియర్లంతా కండువా కప్పుకోవడం తో రాజకీయ సమీకరణలు మారిపోయా యి. ఉమ్మడి జిల్లాలో మళ్లీ కారుజోరు పె రిగింది. ఈసారి కూడా ఉమ్మడి జిల్లాలో 2018 రిజల్ట్ రిపీట్ చేస్తామని నేతలు శ పథం చేస్తున్నారు. కారు స్పీడ్‌కు కాంగ్రె స్, కమలం చతికిలపడుతున్నాయి.
కాంగ్రెస్ అయెమయం..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సొంత జిల్లాలోనే లీడర్లు ఝలక్ ఇస్తున్నారు. పాలమూరు సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని జిమ్మిక్కులు చేస్తున్న ఆ పార్టీకి షాక్ ఇస్తూ చాలామంది నేతలు కారెక్కారు. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాలో హస్తం పార్టీకి భారీ షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కాంగ్రెస్ నాయకుల ధనదాహాన్ని సహించలేక ఆ పార్టీకి రాజీనామా చేసిన నాగం జనార్దన్‌రెడ్డి గులాబీ కండువా కప్పుకోవడంతో పాలమూరు రాజకీయాలు మలుపుతిరిగాయి. కేసీఆర్‌తో ప్రతిసారి విబేధించిన ఆయన తెలంగాణలో, సొంత నియెజకవర్గంలో కండ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూసి గులాబీ గూటికి చేరారు. అంతే గౌరవంతో నాగంను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించి ప్రగతిభవన్‌కు తీసుకెళ్లారు. నాగం చేరికతో ఉమ్మడి జిల్లాలో పార్టీకి అదనపు బలం చేకురింది. అంతకుముందే టీడీపీ సీనీయర్ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వనపర్తి జిల్లాలో తిరుగులేని నాయకులుగా ఉన్న మంత్రి నిరంజన్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో ఇక్కడ గెలుపు ఖాయమైపోయింది. బీజేపీలో మహబూబ్‌నగర్ అసెంబ్లీ సీటును ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, జడ్చర్లలో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్లు కూడా కారెక్కారు. దీంతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారిపోయాయి. కాంగ్రెస్, బీజేపీలకు కొలుకోలేని దెబ్బ తగిలింది. కాంగ్రెస్‌లో టికెట్ రాకుంటే బీజేపీవైపు వస్తారనుకున్న పార్టీ నేతలకు వీరంతా షాక్ ఇచ్చి కారెక్కేశారు.
ప్రచార సభలతో పెరుగుతున్న ఎన్నికల వేడి..
అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడం.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఒకే రోజు నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననుండడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి మరింత రగలింది. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించడం.. ప్రచార పర్వాన్ని ప్రారంభించడంలో బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుంది. ఇప్పటికే మూడు నియెజకవర్గాలను చుట్టివచ్చిన పార్టీ అధినేత మరో నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారపర్వంలో పాల్గొననుండడంతో మరింత జోష్ పెరిగింది. నామినేషన్ల ఘట్టం ముగియగానే మిగితా నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలను ఏర్పాటు చేయడానికి పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట సభలతో మొత్తం ఏడు నియెజకవర్గాల్లో సీఎం కేసీఆర్ ప్రచారం పూర్తవుతుంది. మరో ఐదు నియెజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యక ప్రచార సభల్లో పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి. 6న నిర్వహించే ప్రజాఆశీర్వద సభలను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏర్పాట్లను చేస్తున్నారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని సభను విజయవంతం చేసేందుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి జనసమీకరణ చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ రాకతో ఉమ్మడి జిల్లాలో గులాబీ పార్టీలో మరింత జోష్ కనిపిస్తున్నది.
సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సోమవారం దేవరకద్రలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వద సభకు రానున్నారు. ఇందుకు సంబంధించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నాటికి ఏర్పాట్లను పూర్తి చేనున్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలాన్ని సిద్ధం చేయడంతోపాటు వేదిక నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సభకు వచ్చే వాహనాలను సైతం ఎక్కడికక్కడే పార్కింగ్ చేసేలా దేవరకద్ర సమీపంలో స్థలాలను సిద్ధం చేశారు. సభా స్థలాని ఎస్పీ హర్షవర్ధన్‌రెడ్డి శనివారం పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సభకు సంబంధించి చేపడుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు భారీగా తరలిరానున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు జనసమీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయావెంకటేశ్, ముడా డైరెక్టర్ రాజు, సహకార సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నరేందర్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌యాదవ్, బాలరాజు, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఆంజనేయులు, అంజి, సత్యంసాగర్, రాము, చల్మారెడ్డి, సయ్యద్ జక్కీ, రాధాకృష్ణ, పురేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వరదలా నిధులు..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పేరు కూడా లేని కర్వెనను సర్వే చేయించి, నివేదికలతో వెళ్లి చెప్పడంతో సీఎం కేసీఆర్ ఒప్పుకొన్నారు. ప్రాజెక్టులో భాగంగా కర్వెన ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.3,300కోట్లు మంజూరు చేయడంతోపాటు, 98శాతం పనులు కూడా పూర్తి చేయించారు. అదేవిధంగా మరో రూ.109కోట్లు ఖర్చు చేస్తే 25వేల ఎకరాలకు సాగునీరందుతుందని చెప్పగా, నిధులు మంజూరు చేశారు. వాగులపై 30 చెక్‌డ్యాంల నిర్మాణానికి రూ.190కోట్లు మంజూరు చేశారు. పూడూర్ లిఫ్ట్ కోసం రూ. 55కోట్లు, దేవరకద్రలో 100 పడకల దవాఖాన, కొత్తకోటలో 30 పడకల దవాఖానకు నిధులు మంజూరు చేశారు.