కల్వకుర్తి, జనవరి 26 : అలవిగాని హామీలిచ్చి వాటిని నెరవేర్చలేక కాంగ్రెస్ సర్కారు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ దుయ్యబట్టా రు. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఐదేండ్ల పదవీకాలాన్ని ది గ్విజయంగా పూర్తి చేసుకున్న కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మసత్యంతోపాటు వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఆదివారం కల్వకుర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైపాల్‌యాదవ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల కాలంలో పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కే దక్కుతుందన్నా రు.
మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులు, ప్రజల రక్తం తాగుతుందని దుయ్యబట్టారు. ఏ డాదిగా మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకోవడం, దా చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షాహెద్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, కాటన్‌మిల్లు కార్మిక సంఘ నాయకుడు సూర్యప్రకాశ్‌రావు, వైస్ ఎంపీపీ గోవర్ధన్, పీఏసీసీఎస్ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు మనోహర్‌రెడ్డి, బావండ్ల మంజుల మ ధు, ఖలీల్ యాదమ్మ శ్రీను, తాహేర్‌అలీ, సౌజన్య, చైత న్య కిశోర్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.