బాలానగర్: రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం రాత్రి హైద రాబాద్లోని ఎమ్మెల్యే స్వగృహంలో బాలానగర్ ఉపసర్పంచ్ గిరిధర్‌రావు(కాంగ్రెస్) వైస్ ఎంపీపీ వెంకటాచారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గిరిధర్‌రావుకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక మండలి చైర్మన్ బాద్మి శివకుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యానాయక్, రైతు బందు సమితి మండల అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు మల్లేశ్, మధు, ఎంపీటీసీలు లింగ్యునాయక్, వెంకటయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస రావు, యూత్ వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్, తదితరులు ఉన్నారు