కొల్లాపూర్, జూన్ 27 : కరువు పీడిత తెలంగాణపై సమాఖ్య పాలకుల కక్షకు సజీ వ సాక్ష్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిలుస్తోంది. 1984లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టినా, తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కొట్లాడే వరకు తట్టె డు మట్టి ఎత్తలేదని అందరికీ తెలిసిన విషయమే. డిజైన్ రూపకల్పనలోనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమాఖ్య పాలకులు తీవ్ర అ న్యాయం చేశారు. తెలంగా ణ స్వరాష్ట్రంలో రెండేండ్లలోనే రెండు కీలకమైన లిఫ్ట్‌లను అం దుబాటులోకి తెచ్చి మూడు లక్షల ఆయకట్టు నుంచి 4.51లక్షల వరకు ఆయుకట్టు పెంచడంతో పా టు, 25 నుంచి 40 టీఎంసీలను కృష్ణానది నీళ్ల ను ఎత్తిపోసేందుకు బీఆర్ఎస్ ప్ర భుత్వ హ యాంలో కార్యరూపం దాల్చింది.
అయితే కాం గ్రెస్ పాలనలో మళ్లీ ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురికావడం జరుగుతోందని సాగునీటి నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో ఎంజీకేఎల్ఐ ప్రా జెక్టు కింద మర్మమతుల పేరుతో యాసంగి పం టల సమయంలో క్రాప్ హాలిడే ప్రకటించేందు కు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. రెండున్నరేండ్లల్లో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు పెండింగ్ పనులపై దృష్టి పెట్టకుండా చివరి ఆయకట్టకు సాగునీళ్లు అందకపోడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పవచ్చు.
సమాఖ్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. అసంపూర్తిగా మిగిలిన కొన్ని పెండింగ్ పనులు, నూతనంగా కొన్ని ప్రాంతాలకు సాగునీళ్లు అందించే ప్రక్రియ ప్రారంభమైన దశలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎంజీకేఎల్ఐ ద్వారా లబ్ధిపొందే ప్రాంతానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో ఎంజీకేఎల్ఐ చివరి ఆయకట్టు రైతులు ఎంతో సంతోషించారు. కానీ రెండున్నరేండ్లలో సీఎం సొంత ప్రాంతానికి సాగునీరు రాలేదని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంజీకేఎల్కి ముందుగా నీళ్లను బంద్ చేశారు. అంతేకాకుండా స్వల్పంగా వరద ఉధృతి పెరిగిన ఎంజీకేఎల్ఐ నుంచి సాగునీళ్లు విడుదల చేయకపోవడంపై సీఎంపై సొంత ప్రాంత రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాలకుల పట్టుదల లోపమో, అధికారుల పర్యవేక్షణ లోపమో కానీ.. ఇప్పటికీ ఈ ప్రా జెక్టు తుది దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. సవరించిన అంచనాల ప్రకారం ప్రాజె క్టు వ్యయం రూ. 6,291,43 కోట్లకు చేరగా, ఇందులో 94శాతం కంటే ఎక్కువగా నిధులు ఖర్చు చేసినా క్షేత్రస్థాయిలో ఇంకా 86వేల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగునీరు కలగానే మిగిలిపోయింది. కల్వకుర్తి ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ప్రధాన కాల్వలు, బ్రాంచ్ కెనాల్స్ పనుల్లో తీవ్రమైన ఆలస్యం కనిసిస్తోంది.
ము ఖ్యంగా ఈపీసీ కాంట్రాక్టుల కింద ఉన్న ప్యాకేజీ -29, ప్యాకేజీ -30 పరిధిలోనే ఇంకా అత్యధి క శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నాన్-ఈపీసీ పనులైన ఘన్పూర్ బ్రాంచ్ కాల్వ, బుద్ధారం రైట్ మెయిన్ కాల్వ, మార్కండేయ, కర్నెతండా ఎత్తిపోతల పథకాల పరిధిలోనూ ఆశించిన స్థాయిలో పనులు సాగడంలేదని ఆయా ప్రాంతాల రైతుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అధికారులు ప్రతి ఏటా డెడ్లైన్లు పెట్టడం, వాటిని మార్చడం పరి
పాటిగా జరుగుతోందని పలువురు విమర్శిస్తున్నారు.
నియోజకవర్గాల వారీగా స్థిరీకరణ ఆయకట్టు గణాంకాలను పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఉన్న ఉదాసీనత స్పష్టంగా అర్థమవుతుంది. వనపర్తి నియోజకవర్గంలో 71,151 ఎకరాల ఆయకట్టును సాగులోకి తేవాల్సి ఉండగా, కేవలం 31,200 ఎకరాలకే సాగు నీరుందుతోంది. అచ్చంపేట నియోజకవర్గంలో 81,307 ఎకరాల లక్ష్యానికి గానూ ఇంకా 27,822 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాల్సి ఉంది. కల్వకుర్తిలో 6,574 ఎకరాలు, దేవరకద్రలో 4వేల ఎకరాలు, జడ్చర్లలో 3,262 ఎకరాల చొప్పున ఆయకట్టు పనులు మూలకు పడినట్లు పాలమూరు సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ప్రాజెక్టు పరిధిలో 2016 నుంచే సాగునీటి విడుదల చేస్తున్నటికీ గడిచిన పదేళ్లుగా ఈపీసీ ఏజెన్సీల కాల్వల నిర్వహణ, పర్యవేక్షణ లోపించడం వల్ల ప్రధాన కాల్వలు, గ్రావి టీ కాల్వలు పూడికలతో నిండిపోతున్నాయి. ప్రధాన కాల్వల నుంచి సబ్ కాల్వల నిర్వహణ పూర్తిగా లోపించింది. కాల్వలు అన్ని జమ్ముతో నిండిపోయాయి. దీంతో రైతులకు సాగునీరు అందడంలో ఇబ్బందులు ఎదురవతున్నాయి.
మృగశిర కార్తెలో విత్తనాలు వేసి సాగునీటి కోసం ఎదురు చూస్తున్నా రైతులలో భయం కలిగేలా క్రాప్ హాలిడే ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్న రైతులలో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే జరుగుతున్న ఆలస్యం చాలదన్నట్లు రాబోయే యా సంగి సీజన్లో డిసెంబర్ నుంచి జూన్ వరకు కల్వకుర్తి ఆయకట్టు పరిధిలో పంట విరామం ప్రకటించాలని అధికారులు నిర్ణయించడం రై తుల పొట్టకొట్టడమే అవుతుంది. చాలా వరకు వరి పంట డిసెంబర్లో పొట్టదశలో ఉం టుం ది, ఈదశలో సాగునీరు అందుబాటులో లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. అలాగే కల్వకుర్తి ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలలో ప్ర పంచ ఖ్యాతిగాంచిన మామిడి తోటలు ఉన్నా యి. డిసెంబర్లో పూత, పిందే దశలో ఉంటా యి. ఇలాంటి తరుణంలో క్రాప్ హాలిడే తో మామిడి రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది.
ఉమ్మడి పాలమూరు జిల్లా తో పాటు, కొల్లాపూర్ నియోజకవర్గానికి ఆయుపట్టుగా ఉన్న ఎంజీకేఎల్ఐ, పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తుంది. పీఆర్ఎల్ఐ, ఎంజీకేఎల్ఐ పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. ఎల్‌నినో ఎఫెక్ట్‌కు రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే వరద ప్రారంభమైన వెంటనే ముందుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుల నుంచి కృష్ణానది నీళ్లు ఎత్తిపోయాలి.
– బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొల్లాపూర్