మక్తల్, ఏప్రిల్ 08 : సంఘసంస్కర్త, భారత మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ ఆహ్వాన పత్రికను మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డికి ఆత్మకూరు పట్టణానికి చెందిన జానకిరామ్ అందజేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూర్ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఈనెల 23వ తేదీన ఆవిష్కరిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని హాజరుకావాలని కోరామన్నారు. అందుకు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరవుతానని హామీనిచ్చారన్నారు. 23 సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు పట్టణంలో వేలాదిమంది బాబు జగ్జీవన్ రామ్ సంఘం సభ్యుల మధ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం చేపడుతామన్నారు.