Rajeev Yuva Vikasam | తిమ్మాజిపేట, మే 6 : రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, బావాజిపల్లి, కోడిపత్రి, వెంకయ్యపల్లి గ్రామాలకు చెందిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి రమేష్, ఎంపీడీవో లక్ష్మీదేవి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ భరత్‌లు ఇంటర్వ్యూలు తీసుకున్నారు. అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి, వారు పెట్టుకున్న యూనిట్ గురించి, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
మండలంలో రాజీవ్ యువ వికాసానికి మొత్తం 1413 దరఖాస్తులు వచ్చాయని, పోతిరెడ్డిపల్లి బ్యాంకు పరిధిలో నాలుగు గ్రామాల్లో 183 మందికి మొదటి రోజు ఇంటర్వ్యూలు ఎంపీడీవో తెలిపారు. అభ్యర్థుల వివరాలన్నిటిని జిల్లా కమిటీకి పంపిస్తామని, అక్కడ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న చేస్తారని ఆమె తెలిపారు. అభ్యర్థుల సర్టిఫికెట్లను మూడు అంచల ద్వారా పరిశీలన జరిపారు. ఇంటర్వ్యూల కోసం పెద్ద ఎత్తున అభ్యర్థుల తరలి రావడంతో కార్యాలయం ఆవరణ కిక్కిరిసిపోయింది. ఇంటర్వ్యూలు ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాములు అధికారులు పాల్గొన్నారు.