మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 7 : ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ఈ నెల 1వ తేదీ నుంచే ప్రారంభమైంది. వారం రోజులకు పైనే కావొస్తు న్నా .. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్ర క్రి య ముందుకు సాగడం లేదు. మొన్నటి వరకు క ళాశాలల పునరుద్ధరణ పూర్తి కాలేదనే కారణంతో ఆ న్‌లైన్ ప్రవేశాలు నిలిచిపోగా.. ఆ సమస్య తీరినా కొ న్ని కళాశాలలకు డిజిటల్ కీ యాక్టివ్ కాలేదు.. ఫలితంగా విద్యార్థుల వివరాలు ఆన్లైన్ కాక.. ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలపై ప్రచారం అనుకున్న స్థాయి లో ఉండకపోవడంతో ప్రవేశాలు చేజారుతున్నాయి.
మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 533 అడ్మిషన్లు కాగా బాయ్స్ జూనియర్ కళాశాల-156, ఒకేషనల్ జూనియర్ కళాశాల-14 5, జడ్చర్ల-118, జడ్చర్ల గర్ల్స్ కాలేజీ-111, ఎంవీఎస్ జూనియర్ కళాశాల-101, దేవరకద్ర-78, భూత్పూరు-51, చిన్నచింతకుంట-51, అడ్డాకు ల-50, బాలానగర్-48, యన్మన్గండ్ల-29, కో యిలకొండ-23, మిడ్జిల్-23 అడ్మిషన్లు నమోదయ్యాయి. జిల్లావ్యాప్తంగా మొత్తం 15 కళాశాలల్లో 589మంది బాలురు, 928 మంది బాలికలు మొ త్తం 1517 మంది ప్రవేశాలు పొందారు.
ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు జారీకాక ముందే ప్రైవేట్ యాజమాన్యాలు అడ్మిషన్లు తీసుకుంటున్నా యి. ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 5 కళాశాలలకు మాత్రమే గుర్తింపు ఇచ్చింది. ఇంకా 32 కళాశాలలకు గుర్తింపు ఇవ్వలేదు. ఈ కాలేజీల గుర్తింపు పెండింగ్‌లోనే ఉంది. అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకోవడం ఇంటర్‌బోర్డు నిబంధనలకు విరు ద్ధం. అయినా పాలమూరులో ప్రైవేట్‌లో జోరుగా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఆఫ్‌లైన్‌లోనే ఆ యా కాలేజీలు విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఈ మేరకు కాలేజీల్లో చేర్పిస్తామంటూ, చేరతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, సహాయకులు, విద్యార్థుల నుంచి ఒప్పంద ధ్రువీకరణ సైతం తీసుకుంటున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో మరమ్మతులకు గానూ రూ. కోటి ప్రతిపాదనలు పంపి తే ఇప్పటి వరకు కేవలం రూ.25లక్షల నిధులు మా త్రమే విడుదలయ్యాయని ఇంటర్ విద్యాశాఖ అధికారులు అంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాల పూర్తి శిథిలావస్థకు చేరుకు న్నా.. వాటికి తాత్కాలిక మరమ్మతులు మినహా పక్కా భవనాన్ని మాత్రం నిర్మించడం లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి ఈ కళాశాలలో చేరేందుకు విద్యార్థినులు సుముఖత వ్యక్తం చేస్తున్నా.. కళాశాలలో సౌకర్యాలు, వసతులు కొరవడటంతో ఈ విద్యా సంవత్సరం చేరికలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులంతా పేద కుటుంబాల వాళ్లే. చాలా మంది స మయం మించిపోతోందని అల్పాహారం చేయకుండానే ఖాళీ కడుపుతో కళాశాలలకు పరుగులు తీస్తున్నారు. కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న బాక్స్‌లు విరామ సమయంలో తింటూ మ ధ్యాహ్నం నీళ్లు తాగి కడుపు నింపుకొంటున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలల్లో పేద విద్యార్థులకు మధ్యాహ్న భో జన పథ కం అమలు చేస్తామని ప్రకటించినా.. పథకం అమలుపై మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో అర్థాకలి తో చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. సా యంత్రం ఇంటికి వెళ్లే వరకు ఆకలితో అలమటించాల్సి వస్తోంది.
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఈ విద్యా సంవత్సరం 5వేల అడ్మిషన్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఒకటి రెండు కళాశాలలకు డిజిటల్ కీ సమస్య ఏర్పడినా.. పరిష్కరించాం. కళాశాలల మరమ్మతులకు మొత్తం రూ.కోటి ప్రతిపాదనలు ఉండగా.. ఇప్పటికే రూ.25లక్షలు వచ్చాయి. అందుకు సంబంధించిన పనులు పూర్తి కావస్తుండటంతో మరో రూ.25లక్షలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఏర్పాట్లు చేస్తాం. ప్రైవేట్ కళాశాలలు మొత్తం 37 దరఖాస్తు చేసుకోగా 5 కాలేజీలకు అనుమతులు వచ్చాయి. జిల్లాస్థాయిలో పరిశీలన ప్రక్రియ వందశాతం పూర్తయ్యింది. మిగిలిన వాటి అఫిలియేషన్ ప్రక్రియ ఇంటర్ బోర్డు పరిధిలో ఉంది.
– చిలుక రమణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారిణి, మహబూబ్‌నగర్