పెబ్బేరు, ఫిబ్రవరి 9 : ఆంధ్రప్రదేశ్‌లో భారత్ రాష్ట్ర సమితి పార్టీపై ప్రజలు ఆసక్తి క నబరుస్తున్నారని బీఆర్ఎస్ పెబ్బేరు మండల నాయకుడు పాతపల్లి గోవిందు అన్నారు. గురువారం ఆయన తిరుమలలో పార్టీ ఉద్దేశం గురించి భక్తులకు వివరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి రూపొందించిన క్యాలెండర్లను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సమూల మార్పుకోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. పార్టీ ఏపీలోనూ విస్తరించాలని, దేశంలో విజయవంతం కావాలని ఏడుకొండల వెంకన్నను మొక్కుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు సింగిరెడ్డి శశిధర్‌రెడ్డి, కట్టా శ్రీనివాసరెడ్డి సూచనలతో తాను ఆంధ్రాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.