గద్వాలటౌన్, జనవరి 22 : మున్సిపాలిటీలోని 12వ వా ర్డులో నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అసహనం వ్య క్తం చేశారు. ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలంటూ నాయకులను నిలదీశారు. మరికొన్ని వార్డుల్లో ప్రభుత్వ ఉద్యోగుల పేర్లు ఇందిరమ్మ జాబితాలో ఉండడంతో పేదలను పక్కనపెట్టి అనర్హులకు అందలం ఎక్కించారంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంగ్రెస్ కార్యకర్తలై ఉంటే ఎవరికైనా ఇస్తారా? అంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అర్హులకు ఎంపిక చేయాలని డి మాండ్ చేశారు. మా ప్రమేయం లేకుండానే జాబితాలో పేర్లు వచ్చాయని కౌన్సిలర్లు అహసనం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత కాలేదని చెప్పడంతో గద్వాల మండలం చెనుగోనిపల్లికి చెందిన జయమ్మ తన బాధను వెల్లగక్కింది. ‘నాకు సెంటు భూమి కూడా లేదు కూలి పనిచేసుకొని జీవనం సాగిస్తున్నాను.. నా భర్త ఏ పనిచేయకపోవడంతో జీవనాధారం భారం నాపై పడింది. నేను గ్రామంలో ఉపాధి పనులు ప్రారంభైన నాడు వెళ్లాను.. మిగితా సమయంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నా.. ఇప్పు డు ఆత్మీయ భరోసాకు దరఖాస్తు చేసుకుందామంటే ఉపాధి హామీ పని దినాలు తక్కువగా ఉన్నాయి’ అని వాపోయింది.