వంగూరు జూన్ 13 : ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలైన పేదలను విస్మరిస్తున్నది. ని త్యం నేతలకు దండం పెడుతూ వారి భజన చే సే వారికే పథకాలు అందుతున్నాయని.. ఇదే నా ప్రజా పాలన అంటూ పలువురు పేదలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 433 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ప్రత్యేక గ్రా మంగా గుర్తించిన మండలంలోని మిట్టసదగోడులో 53 ఇండ్లు మంజూరయ్యాయి.
దీంతో మొత్తం 486 ఇండ్లు మండలానికి మంజూరై ప్రొసీడింగ్‌లు సైతం లబ్ధిదారులకు అందించా రు. వీరిలో చాలా వరకు అనర్హులకే ఇందిరమ్మ ఇల్లు వరించిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదిలా వుండగా వంగూరు మండల కేంద్రానికి చెందిన ఒగ్గు రమణమ్మ అనే పేద మహిళకు ఇండ్లు మంజూరైనట్టే అయ్యి చివరికి రాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నది. వంగూరులో కేవలం ఒక రూంలో ఉంటూ పక్కన ఇటుకతో కట్టిన గోడల్లో భార్యాభర్తలు కాపురం చేస్తున్నారు.
మొదట ప్రభుత్వం విడుదల చేసిన ఆన్లైన్ ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో రమణమ్మ పేరు ఉండగా స్థానిక ఎమ్మెల్యే ఫై నల్ చేసిన అసలు లిస్టులో రమణమ్మ పేరు లే కపోవడంతో తీవ్ర ఆందోళనకు గురై మనస్తా పం చెందింది. స్థానిక నేతలతోపాటు మండల నేతలు కలిసి తనకు మంజూరైన ఇళ్లును ఉద్దేశ్యపూర్వకంగానే తీసేశారని ఇది ఎంత వరకు స మంజసమని ప్రశ్నించారు. ప్రజా పాలన అం టూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పెద్దలు పార్టీ కోసం పని చేసే వారికి వారిచ్చే బహుమతి ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇల్లు లేక వేరే వాళ్ల ఇంట్లో వుంటూ కాలం వెల్లదీస్తున్నాం. పిల్లలు పెద్దగయ్యిర్రు. మా అమ్మ ఇదే పార్టీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది. అయినా పార్టీనే నమ్ముకొని వున్నాం. ఇల్లు లేక కట్టిన గోడలు కొంత వాడుకుంటున్నం. ఇల్లు వస్తుందని ఎంతో ఆశతో ఉంటే రాలేదు. ప్రజా పాలన అంటూ మస్తు మాట్లాడుతరు. ఇదేం పాలన, అంతా మోసం.
– ఒగ్గు రమణమ్మ. వంగూరు