గట్టు : నెట్టెంపాడు ప్రాజెక్టులో ( Nettempad ) భాగంగా చేపట్టిన చిన్నోనిపల్లి రిజర్వాయర్ ( Reservior 0 నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses) మంజూరు చేయాలని రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ( Minister Srinivas Reddy ) నిర్వాసితులు శనివారం వినతి పత్రం అందజేశారు.
భూభారతి రెవెన్యూ చట్టం అవగాహన సమావేశానికి మండల కేంద్రం ధరూర్ కు వచ్చిన మంత్రికి మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. పునరావాస కేంద్రంలో ఇక్కట్లు పడుతూ జీవనం సాగిస్తున్నామని, తమను ఆదుకుని ఇళ్ళను మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాసిత రైతులు, గ్రామస్థులు శ్రీనివాసులు, నరసింహులు, జయరాం గౌడ్ , వెంకటేష్, తిమ్మారెడ్డి, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.