బిజినేపల్లి : అర్హులైన ప్రతి ఒక్క పేదవారికి ఇందిరమ్మ ఇల్లు (Indiramma houses ) నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రగుంట తండా, లట్టుపల్లి, చిన్న పేరు తండా, బిజినపల్లి తండా, బోయాపూర్ గ్రామాల్లో కొత్తగా మంజూరైన ఇళ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరంగా కొనసాగుతుందని, ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయని ఎవరు కూడా అధైర్యపడవద్దని కోరారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్ధిదారులు ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వకూడదని సూచించారు. కార్యక్రమంలో చంద్ర గౌడ్, గోవింద నాయక్, ప్రేమ్‌లాల్, వెంకటస్వామి, శ్రీశైలం, చంద్రు నాయక్, చందూలాల్, రాజు నాయక్, రాములు,ఈశ్వర్, పరశురాములు, నవీన్ రెడ్డి, తిరుపతయ్య, నజీర్, మహేష్, చంద్రయ్య, సైదులు, పూల్యా నాయక్, బాల్యనాయక్ తదితరులు ఉన్నారు.