జోగులాంబ గద్వాల : భారత స్వాతంత్య్ర పోరాటం ( India freedom ) ప్రపంచానికి ఆదర్శమని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి , ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి (Jitender Reddy ) అన్నారు. స్వాతంత్ర్యం తరువాత పేదరికం, అసమానతలు,అస్పృశ్యతపై పోరాటం ప్రారంభించి ప్రజాస్వామ్య పునాదులు వేసిందని పేర్కొన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల (Jogulamba Gadwala) జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు.అనంతరం దేశభక్తి ఉట్టిపడేలా బాల భవన్, వివిధ పాఠశాలల విద్యార్ధులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేసి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఐడీవోసీలో పథకావిష్కరణ గావించిన జిల్లా కలెక్టర్
అంతకు ముందు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో కలసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,స్వాత్రంత్ర సమర యోధులకు ఘనంగా నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.