గద్వాలటౌన్, జూలై 5 : అర్హులైన పింఛన్‌దారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైవ్ అంథెటికేషన్ సర్వే చేపట్టింది. గద్వాల మున్సిపాలిటీలో మే నెలలో చేపట్టిన సర్వే ఇప్పటి వరకు కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 70శాతం సర్వే మాత్రమే పూర్తికాగా ఇంకా 30శాతం సర్వే చేపట్టాల్సి ఉం ది. అయితే జూన్ 15వ తేదీ వరకే సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇంతవరకు పూర్తి కాలేదు. అయితే అధికారులు మాత్రం సర్వే ఎప్పటి వరకు చేపట్టాలన్నది మాత్రం స్పష్టత ఇవ్వ డం లేదు. సర్వే నిరంతరం కొనసాగుతుందని కిందిస్థాయి సెక్షన్ అధికారులు అంటుండగా.. త్వరలో పూర్తి చేస్తామని అటువంటిది ఏమి లేదని వార్డు అధికారులు అంటున్నారు. మొత్తం మీద సర్వే నిర్వహణపై అధికారులకే పూర్తి స్థాయిలో సమన్వయం లేకపోవడ గమనార్హం.
గద్వాల మున్సిపాలిటీలో మొ త్తం 7,761 పింఛన్లు ఉన్నాయి. వాటిలో వృద్ధాప్య పింఛన్లు 2,5 76, వితంతువులు 3,396, దివ్యాంగులు 876, కల్లుగీత కార్మికులు 24, చేనేత కార్మికులు 732, ఒంటరి మ హిళలు 156, బీడి కా ర్మికులు ఒకరు ఉన్నా రు. అలాగే కొత్త పిం ఛన్ల కోసం వితంతువులు, వృద్ధు లు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు 4,500మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు 5,700 మంది పింఛన్ దారులను గుర్తించి లైవ్ అంథేటికేషన్ పూర్తి చేసి ఆన్లైన్ చేశారు. ఇంకా 2,071మంది లైవ్ అంథెటికేషన్ చేసి ఆన్లైన్ చేయాల్సి ఉంది. కాగా కొత్త దరఖాస్తుల పరిశీలన మాత్రం ఊసేత్తడం లేదు.
మున్సిపాలిటీలో బ్యాంక్ ఖాతా ద్వారా పింఛన్లు పొందుతున్న పింఛన్‌దారుల లైవ్ అంథెటిక్ సర్వే బాధ్యతలు వార్డు అధికారులకు అప్పగించారు. వారికి కేటాయించిన వార్డుల వారీగా పింఛన్‌దారుల వద్దకు నేరుగా వెళ్లి కనుపాపను స్కాన్ చేసి ఆన్లైన్ చే యాలి. ఒక వేళ కనుపాప సరిపోక పోతే వేలిముద్రలు తీసుకోవా లి. మే నెలలో వార్డులో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి పింఛన్‌దారుల కనుపాపను స్కాన్ చేసి ఆన్లైన్ చేశారు. వృద్ధులు, ది వ్యాంగులు ఎక్కువగా ఉండటం వల్ల నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి లైవ్ అంథెటికేషన్ చేస్తున్నారు. అయితే చాలామంది చిరునామా మారడం, ఫోన్ నెంబర్లు అందుబాటులో లేకపోవడం కారణంగా గుర్తించడం సమస్యగా మారిందని తద్వారా ఆన్లైన్ ఆలస్యమవుతుందని అధికారులు చెప్తున్నారు.