మహబూబ్నగర్ కలెక్టరేట్, నవంబర్ 18 : స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను క్రోడీకరించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన బహిరంగ విచారణ సమావేశం లో ఈ మేరకు ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ గుర్తింపు అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలో బహిరంగ విచారణలో భాగంగా కమిషన్ కార్యదర్శి సైదులు, కలెక్టర్ విజయేందిరబోయి, అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్రావు తదితరులతో కలిసి వివిధ సంఘాల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల్లో దామాషా ఖ రారు చేసేందుకు ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేలో జనాభా వివరా లు వెల్లడించాలని, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల కోసం అభిప్రాయ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.