హన్వాడ : హన్వాడ మండలంలోని మాదారం అమ్మాపూర్ శివారులో సర్వేనెంబర్ 72, 73లో అక్రమంగా పట్టా చేసిన వాటిని వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్( BRS ) మండల అధ్యక్షులు కరుణాకర్ గౌడ్ ( Karunakar Goud ) డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు మండలంలోని సర్వే నెంబర్ 72, 73 భూములను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు సర్వేలో సాగులో ఉన్న భూములను అక్రమంగా పట్టా చేసుకోవడం దారుణమని ఆరోపించారు.
పట్టాను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని కరుణాకర్ గౌడ్ డిమాండ్ చేశారు. అధికారముందని చట్టానికి విరుద్ధంగా ఒక ఎమ్మెల్యే అనుచరుడు పట్టా చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని సాగులో ఉన్న భూముల లబ్ధిదారులకు పట్టా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నరేందర్, మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, చెన్నయ్య, నాగన్న, నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, మాధవులు గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు .