ఉప్పునుంతల, జూన్ 2 : మద్దిమడుగు ఆంజనేయ స్వామి పేరు చెప్పి దుందుబీ వాగులో మరోసారి ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఇసుక టిప్పర్లను సోమవారం రాత్రి మండలంలోని దాసర్లపల్లిలో గ్రా మస్తులు అడ్డుకొని ఉప్పునుంతల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.గ్రామస్తుల కథనం ప్రకారం మూడురోజులుగా రాత్రిపూట ఎలాంటి అనుమతులు లేకుం డా మద్దిమడుగు అంజన్మ పేరుతో ఇసుక మాఫియా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుకను ఆక్రమంగా తరలిస్తున్నారు.
రాత్రిపూట ఇసుక టిప్పర్ల శబ్దంతో నిద్ర లేక ఇబ్బందులు పడిన గ్రామస్తులు గుడి పేరిట ఆక్రమ దందాకు తెరలేపిన వైనాన్ని సర్పంచ్ రమేశ్‌రెడ్డికి తెలిపారు. గత్యంతరం లేక సర్పంచ్, గ్రామస్తులు గుడిపేరిట మూడు టిప్పర్లను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. గ్రామస్తుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. దాసర్లపల్లి దుందుభీ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మామిళ్లపల్లి సర్పంచ్‌కు చెందిన టిప్పర్‌తోపాటు తెలకపల్లికి చెందిన మరో రెండు టిప్పర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
టిప్పర్లు అడ్డుకున్న గ్రామస్తులు
చారకొండ, జూన్ 2: మండలంలోని సిరుసనగండ్ల శివారులోని చింతలకుంట చెరువు నుంచి తరలిస్తు న్న నల్లమట్టి టిప్పర్లు గ్రామాల గుండా అతివేగంగా వెళ్తున్నాయని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని శాంతిగూడెం బీఆర్ఎస్ సర్పంచ్ తన్నీరు శిరీషారామకృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని శాంతిగూడెం గ్రామస్తులు నల్లమట్టి తరలిస్తు న్న టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లమట్టి టిప్పర్లలో అధిక లోడ్ వేసుకొని డ్రైవర్లు అతివేగంగా నడిపిస్తున్నారని చెప్పారు. గ్రామంలో రోడ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని, దుమ్ము దూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న టిప్పర్ల యాజమాన్యం పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.