సరిహద్దులు దాటుతూ..
కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా నదిని కొల్లగొడు తూ వందల టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నా రు.
- కృష్ణానదిని తోడేస్తున్న ఇసుక మాఫియా
- అడ్డూఅదుపు లేకుండా అక్రమ రవాణా
- న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘నమస్తే’ విలేకరి, జిల్లా ఫొటోగ్రాఫర్‌పై మూకుమ్మడి దాడి
- కృష్ణ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు
- పాలమూరు దవాఖానకు తరలింపు
- దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు
ఊట్కూర్, జూలై 18 : కృష్ణాతీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు, కృష్ణ మండలాల్లో దందా జోరందుకున్నా.. అటువైపు పోలీసులు గానీ.. రెవెన్యూ అధికారులు గానీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉ న్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా నదిని కొల్లగొడు తూ వందల టిప్పర్ల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నా రు. ప్రభుత్వ అనుమతుల పేరిట ఆన్లైన్ ఇసుక రవాణాను ‘అక్రమ రవాణా’గా మార్చి రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. కృష్ణ మండలం వాసునగర్ శివారులోని నదిలో హిటాచీలను రంగంలోకి దించి భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నా.. అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
కవరేజీకి వెళ్లిన ‘నమస్తే’ రిపోర్టర్, దాడి
కృష్ణ మండలం వాసునగర్ సమీపంలో కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణాను కవరేజీ చేయడానికి వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ మాగనూరు విలేకరి రాము, జిల్లా ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం కృష్ణానది ను ంచి ఇసుక తరలిపోతుంటే చిత్రీకరిస్తుండగా మాఫియా అడ్డుకొని ఇద్దరిపై దాడికి పాల్పడింది. విలేకరి కడుపులో పిడిగుద్దులు గుద్దడంతో మూగ దెబ్బలు తగిలాయి. భౌతిక దాడులకు పాల్పడడంతోపాటు నది వద్దకు వస్తే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
గాయపడిన జర్నలిస్టులు అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో గూడెబల్లూరుకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత వాకిటి నారాయణతోపాటు ఆయన అనుచరులు ఉన్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఇద్దరిని మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. వైద్యుల సూచనల మేరకు అక్కడి నుంచి పాలమూరు జనరల్ దవాఖానకు తరలించారు. నిత్యం వందలాది టిప్పర్లతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నా అధికారులు స్పం దించకపోవడం వెనుక రాజకీయ అండదండలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.
దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు
కృష్ణానది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నదని న్యూస్ కవరేజీకి వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ మాగనూరు రిపోర్టర్ రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్పై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఎస్పీ వినీత్, మక్తల్ సీఐ రామ్‌లాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

