మాగనూర్, మే 8 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుక అక్రమ రవాణా జోరుగా నడుస్తుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కలెక్టర్ మన ఇసుక మన వాహనం అన్లైన్ ద్వారా ట్రాక్టర్లకు పర్మిషన్ ఇస్తున్నారు. అయి తే మాగనూర్ మండలం పెద్దవాగులో వర్కూర్, వడ్వాట్, మందిపల్లి అడవిసత్యా రం మాగనూర్, నేరడగం వాగులో ఇసుక పర్మిషన్ ఇస్తున్నారు. ఇసుక పర్మిషన్ తీసుకున్న ట్రాక్టర్ యజమానులు పర్మిషన్ తీసుకున్న కంటే ఎక్కువ ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. గురువారం వర్కూర్, దాసర్ దొడ్డి వాగులో జీపీవో రాక ముందే ఎవరూ లేని సమయంలో 15 ట్రాక్టర్లతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని పలువురు ఆరోపించారు.
కొల్పుర్లో కేవలం మూడు ట్రాక్టర్లకు పర్మిషన్ ఇన్తే 10 ట్రాక్టర్ల ఇసుక తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కొందరు జీపీవో, ఎస్ఆర్ఎ, కంప్యూటర్ ఆపరేటర్లకు ముడుపులు ఇచ్చి పర్మిషన్ లేకున్నా ట్రాక్టర్ల ఇసుక ఆక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఇంత చేస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇసుకను అక్రమంగా తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.