ఉప్పనుంతల, మార్చి 7 : అనుమతుల పేరిట దుందుభీ వాగును గుల్ల చేస్తున్నారు. 15 రోజులుగా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా చే స్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. గతనెల 11న ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కలెక్టర్ బదావత్ సంతోశ్‌కుమార్ మండలంలోని దుందుభీ పరిసర ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పర్యవేక్షణకు డీఎస్పీ సత్యనారాయణ సమక్షంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించా రు. అవసరమున్న వారికి ఆన్లైన్ ద్వారా గుర్తించిన ఇసుక రీచ్‌ల నుంచి రెవెన్యూ, పోలీస్ అధికారులు కూపన్లు పరిశీలించిన తర్వాత ఉద యం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ మరుసటి రోజు నుంచే మాఫియా అధికార పార్టీ అండదండలతో విచ్చలవిడిగా తరలిస్తున్నది. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మొల్గర, పెద్దాపూర్, సదగోడు ప్రాంతాల్లోని వాగు నుం చి నిత్యం 500 ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం. పదర, అమ్రాబాద్, అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, లింగాల మండలాల్లో నిర్మిస్తున్న సీసీరోడ్లు, ఆలయాలు, జీపీ భవనాలు, ఇతర ప్రభుత్వ పనులకు అనుమతి పేరిట తరలిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు జేసీబీ, హిటాచీతో వ్యాపారా న్ని మూడు పువ్వులు.. ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం 4 జేసీబీలు ఇసుకను తోడేస్తున్నాయి. అధికారులు ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలో ప్రభుత్వ పరం గా జరుగుతున్న సీసీరోడ్లు, జీపీ భవనాలు, ఆలయాల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సంబంధిత అధికారుల ప్రొసీడింగ్ కాపీల ఆధారంగా ఇసుక తరలింపునకు అనుమతి ఇ స్తున్నా ం. జేసీబీ, హిటాచీలకు అనుమతి లేదు. – ప్రమీల, తాసీల్దార్, ఉప్పునుంతల