మాగనూరు కృష్ణ : కృష్ణానది నుంచి రాత్రి వేళలో ఇసుక ( Sand ) అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుందని , ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు వెంటనే అరికట్టాలని బీఆర్ఎస్ ( BRS ) యువ నాయకులు శివరాజ్ పాటిల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వై శివప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ వెంకటేష్‌కు, ఎస్సై నవీద్‌కు వినతి పత్రాలు అందజేశారు .
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మీడియా సమావేశంలో ఆరోపించారు. రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా విచ్చలవిడిగా అక్రమంగా ఇసుక తరలిస్తూ,సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంబ్రేషన్ శంకర్ నాయక్, బీఆర్ఎస్ ఉపాధ్యక్షులు మహలింగ, ఉపాధ్యక్షుల భీము, మాజీ ఎంపీటీసీ దేవేందర్ అప్పా, గుర్జాల్, వెంకటేష్, సురేష్, గుడవలూరు తేజ ,ఆలంపల్లి బరం రెడ్డి, కృష్ణ , సురేష్, మడివాల కృష్ణ, నరసింహ రెడ్డి, అయినపూర్ లక్ష్మణ్, ఎస్ లింగప్ప తదితరులు పాల్గొన్నారు.