Sand Mafia | ఖిల్లా గణపురం, మార్చి 12 : పంటలు పండే వ్యవసాయ భూములు కోతకు గురవుతున్నాయని ఇసుక అనుమతులు నిలిపివేయాలని మల్కిమియానపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు కోరుతున్నారు. గ్రామ శివారు నుండి వెళ్తున్న పిల్లి వాగులో గత రెండు సంవత్సరాలుగా ఇసుక తరలించడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. దీంతో అక్రమంగా ఇసుక తరలించే రవాణాదారులు పట్టా భూముల పేరుతో వాగు మధ్యలో 50 ఫీట్ల పొడవు 25 ఫీట్ల వెడల్పు 20 ఫీట్ల లోతుతో రైతులు గుంతలు ఏర్పాటు చేస్తున్నారని దీంతో ఇసుక తీయడంతో పైనున్న రైతుల భూములు వర్షాకాలంలో వరదలు రావడంతో భూమి కోతలకు గురవుతోందని ఎకరాలకు ఎకరాలే కొట్టుకుపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఉధృతంగా పిల్లి వాగు ప్రవహిస్తుండడంతో మల్కిమియానపల్లి శివారు నుంచి వెంకటంపల్లి శివారు వరకు ఎలాంటి చెక్ డ్యామ్లు లేకపోవడంతో ఇసుక గోతులు తీయడం వల్ల భూములు కోతకు గురవుతున్నాయని రైతులు తెలిపారు. గత జులై మాసంలో కురిసిన భారీ వర్షాలకు పిల్లి వాగు వెంబడి ఉన్న పొలాలతోపాటు దళితబంధులో మంజూరైన కోళ్ల ఫారాలకు చెందిన పశువుల కొట్టాలు కొట్టుకుపోయాయని, అలాగే విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ బోర్ మోటర్లు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కల్పించుకుని ప్రభుత్వం గుర్తించిన ఇసుక క్వారీల నుండి ఇసుక తరలించడానికిఅనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు.
వ్యవసాయం చేసుకునే పట్టా పొలాలు కోతకు గురవుతున్న ఇసుక తరలింపుకు అనుమతులు ఎలా ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతుల పట్టా పొలాలలో ఇసుకమేటలు వేసి ఇసుకను తరలించడం వల్ల భూములు వ్యవసాయం చేసుకోవడానికి పనికి వస్తాయి అనుకుంటేనే పట్టా భూములలో ఇసుకను తరలించడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వాలని, కానీ మండల పరిధిలోనిమల్కిమియానపల్లి పిల్లివాగులో గత ఏడాదిన్నరగా రెవెన్యూ అధికారులు ఇష్టా రాజ్యంగా అనుమతులు ఇస్తున్నారని కింది ప్రాంతంలో ఉన్న రైతులు ఇసుకను తరలిస్తుండడంతో వాగుకు పైనున్న వ్యవసాయదారుల భూములు కోతకు గురవుతున్నాయని వెంటనే ఇసుక అనుమతులు ఆపివేయాలని, ప్రభుత్వం గుర్తించిన అంతాయపల్లి కొత్తపల్లి వాగు నుండి ఇసుక తరముగిలింపుకు అనుమతులు ఇవ్వాలని పిల్లి వాగు వెంబడి ఉన్న రైతులు కోరుతున్నారు.