అయిజ/కొత్తకోట/నాగర్‌కర్నూల్ రూరల్, మార్చి 28 : న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆశ కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించ డం సిగ్గుచేటని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఆశా వర్కర్ల నాయకురాళ్లు హెచ్చరించారు.
శనివారం చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైన ఆశ కార్యకర్తలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జా ము నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మా ట్లాడు తూ ఆశ కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనాలను పెంచాలని, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఇచ్చిన రూ. 18 వేల కనీస వేతనం హామీని నెరవేర్చాలని, నెలల తరబడి బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని వెళ్తుంటే అడ్డుకోవడం తగదన్నారు.
శాంతియుతంగా, న్యాయబద్దంగా నిరసన తెలిపే హక్కును కాంగ్రెస్ సర్కార్ హరిస్తోందని వారు దుయ్యబట్టారు. అరెస్టు చేసిన ఆశ కార్యకర్తలను సాయం త్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.