కొల్లాపూర్ రూరల్, మే 5 : మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు పదిరోజులుగా రైతులు కొన్ని వందల క్వింటాళ్ల వడ్లను తీసుకొచ్చారు. ప్రతిరోజూ వరి కుప్పనలు ఆరబెట్టాలి.. మళ్లీ సాయంత్రం బొడ్డే వేయడంతోనే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మా ర్కెట్ యార్డును నమస్తే తెలంగాణ సందర్శిస్తే రైతులు మనోవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ పగలు రాత్రి పడిగాపులు కాస్తున్నామ ని ఆరోపించారు. పదిరోజులుగా మార్కెట్ యార్డులో అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించక రైతులు బిక్కుబిక్కుమని పడిగాపులు కాస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పుడప్పుడని కాలం వెల్లదీస్తున్నారు. ఇం కా ఎన్నిరోజులు ఉండాలో తెలియక రైతులు దిగాలు చెందుతున్నారు. పగలు, రాత్రి నిద్రాహారాలు మాని మార్కెట్ యార్డులోనే దినా లు గడుపుతున్నామని వాపోతున్నారు.
ఆకాల వర్షాలు, ఉరుములు మెరుపులతో ఆందోళన చెందుతుంటే.. వడ్లు ఆరిపోయి గలగలా మోగుతున్నా అధికారులు మిషన్లు పెట్టి తేమశాతం ఉంది ఇంకా ఆరాలని చెబుతున్నారని రైతులు మనోవేదన చెందుతున్నారు. ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అంటే ఇదేనా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కన్నీళ్లు పెట్టించడమేనా అంటూ ప్ర భుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆరుగాలం ధాన్యా న్ని పండించి మార్కెట్కు తీసుకొని వస్తే ప్రభుత్వం ఇంకా కొనకుండా రైతులను మా నసికంగా ఇబ్బందులకు గురిచేడయం సబ బు కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్నికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.