గద్వాల అర్బన్, మే 19 : జిల్లాలో ఆర్ఎంపీ, పీ ఎంపీ (గ్రామీణ వైద్యులు)లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. గతంలో గ్రామానికి ఒక్క ఆర్ఎంపీ వైద్యుడు ఉంటే గగనం.. అలాంటిది ప్రస్తుతం ప్రతి గ్రామానికి పదిమంది చొప్పున ఆర్ఎంపీలు ఉన్నారు. వీరు చదివింది చారెడు.. కానీ వీరు చేసే చికిత్సలు మాత్రం బారె డు.. అనేలా ఉంటున్నాయి. ఆర్ఎంపీలు చేసే చికిత్సలు పెద్దపెద్ద చదువులు చదివిన డాక్టర్లే కొన్ని సమయాల్లో చేయాలంటేనే జంకుతారు.
కానీ వైద్య విద్యను కూడా చదవని ఆర్ఎంపీలు తమ స్థాయికి మించి రోగులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీరు చేసే చికిత్సలు వికటించి రోగుల ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినా తమకు తోచిన చికిత్స చేసి రోగుల నుంచి అందినకాడికి దోచుకోవడం అలవాటుగా మా రింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీ, పీఎంపీల దందా జోరుగా సాగుతున్నది. వారు ఆయా దవాఖానల్లో కొ న్ని రోజుల పాటు వైద్యం నేర్చుకొని (సహాయకులుగా పనిచేసి) అనంతరం ఏదో ఒకచోట క్లినిక్‌లు ఏర్పాటు చేసుకొని డాక్టర్లుగా చలామణి అవుతున్నారు.
జిల్లాలో దాదాపు వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీలు ఆయా గ్రా మాల్లో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. వీరిలో చా లా మందికి వైద్యం మీద ఎలాంటి అవగాహన లేదనే ఆరోపణలు ఉన్నాయి. గట్టు మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ తన స్థాయికి మించి రోగులకు వైద్య చికిత్సలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు రెండు, మూడు దఫాలుగా క్లినిక్ మీద దాడులు నిర్వహించారు. అయినా తనిఖీలు చేసిన కొన్ని రోజులు ఆగి మళ్లీ య థావిధిగా స్థాయికి మించి వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న ట్లు గుసగుసలు వినబడుతున్నాయి. తనిఖీలకు వచ్చిన అధికారులకు ఆ ఆర్ఎంపీ మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.
అదేవిధంగా అయిజ పట్టణంలోని కొట్టం కాలేజీ సమీపంలో ఓ ఆర్ఎంపీ కూడా తన స్థాయికి మించి వైద్య సేవలు అందిస్తున్నాడు. క్లినిక్‌తోపాటు ఏకంగా మెడికల్ షాపును ప్రారంభించి పెద్ద డాక్టర్లా రోగులకు చికిత్సలు అందిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాడు. అలాగే రాజోళి మండలంలోని వెంకటాపురంలో కూడా ఓ ఆర్ఎంపీ తన క్లినిక్‌ను దవాఖాన తరహాలో నిర్వహిస్తూ గైనిక్‌కు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక చికిత్స నిమిత్తం సూదులు, మందులు ఇంత నగదు అంటూ రోగుల నుంచి పెద్ద మొ త్తంలో డబ్బులు గుంజుతున్నారు. అలానే గర్భిణులకు స్కానింగ్ కూడా తీస్తున్నట్లు సమాచారం. కనీసం వైద్య చికిత్సకు సంబంధించి ఎలాంటి చదువు చదవకుండానే స్కానింగ్‌లు, చికిత్సలు నిర్వహించడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
వీరి స గం సగం చికిత్సలతో ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థాయికి మించి వైద్యం చేసే వా రిపై చర్యలు తీసుకోవాలి, కానీ వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల్లో కొంత మంది మామూళ్లకు అలవాటు పడి వా రిని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతుండగా గ్రామీణ వై ద్యులు తమ దందాను మూడు.. పువ్వులు.. ఆరు కా యలుగా కొనసాగిస్తున్నారు. స్థాయికి మించి చికిత్సలు చేసే గ్రామీణ వైద్యులపై వైద్యాధికారులు అవగాహన కల్పించి నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారిపై దృష్టి సారించడంలో విఫలం అవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రామీణ వైద్యులు కేవ లం ప్రథమ చికిత్సలు మా త్రమే చేయాలి తప్పా స్థా యికి మించి వైద్యచికిత్స లు చేయరాదు. రోగులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉం చుకొని ప్రభుత్వ దవాఖానకు లేదా ఎంబీబీఎస్ డా క్టర్‌కు రెఫర్ చేయాలి త ప్పా గ్రామీణ వైద్యులు చికిత్సలు చేయరాదు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా స్థాయికి మించి చేసే గ్రామీణ వైద్యుల క్లినిక్‌లను తనిఖీ చేసి వారిపై చర్యలు తీసుకుంటున్నాం.
– సిద్ధప్ప, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జోగుళాంబ గద్వాల