మూసాపేట, మార్చి 28 : పవిత్ర రంజాన్ వేడుకను పురస్కరించుకొని శుక్రవారం అత్యంత భక్తి పెద్దలతో షబ్ ఏ ఖదర్ వేడుకను ముస్లింలు నిర్వహించుకున్నారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం పవిత్ర రంజాన్ మాసం 27వ రోజు గురువారం రాత్రి షబ్ ఏ ఖదర్ జాగరణ చేశారు.
మూసాపేట మండల కేంద్రంతో పాటు జానంపేట, వేముల పోల్కంపల్లి, తిమ్మాపూర్, చక్రాపూర్, కుమ్మిరెడ్డిపల్లి, సంకలమద్ది తదితర గ్రామాలతో పాటు, అడ్డాకుల మండల కేంద్రంతోపాటు కందూరు, పొన్నకల్, రాచాల శాఖపూర్ తదితర గ్రామాల్లోని మసీదులలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. మత పెద్దలతో పాటు కలిసి దువా, నాతే షరీఫ్, సలాం చదివారు. ఈ యొక్క షబ్ ఏ ఖదర్ రాత్రి విశిష్టత, ఖురాన్ అవతరించిన సందేహాలు, సమస్త మానవాళి ఆచరించిన అంశాల గురించి మత పెద్దలు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల మాజీ ప్రజా ప్రతినిధులు, మైనార్టీ నాయకులు మత పెద్దలు, మజీద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మజీద్ లో ఇఫ్తార్ విందు
మూసాపేటలో జామే మజీద్ లో శుక్రవారం ఉపవాస దీక్షలు ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కు చెందిన ఆజాద్ కళాశాల చైర్మన్ గౌస్ మైనోద్దీన్ మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండల కేంద్రంలోని జామే మసీద్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలంతా సామూహిక ప్రార్థనల అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొని ఉపవాస దీక్షలను విరమించారు.