రేబిసు బీ కేర్‌ఫుల్
రేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో వీధుల్లో తిరిగే జంతువులైనా.. పెంపుడు జంతువులైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశాలు లేకపోలేదు.
- పిచ్చికుక్కలతో వ్యాధి వ్యాప్తి
- మూగజీవాలు, పెంపుడు జంతువులకు వ్యాక్సిన్ తప్పనిసరి
- మనుషులకూ వ్యాధి సోకే అవకాశం
- పది రోజుల్లో గుర్తించకపోతే చనిపోయే ప్రమాదం
- ముందు జాగ్రత్తగా యాంటీ రేబిస్ టీకా
- ప్రభుత్వ దవాఖానలో అందుబాటులో వ్యాక్సిన్
- నేడు ప్రపంచ రేబిస్ వ్యాధి నివారణ దినోత్సవం
కోస్గి, సెప్టెంబర్ 27 : రేబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో వీధుల్లో తిరిగే జంతువులైనా.. పెంపుడు జంతువులైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశాలు లేకపోలేదు. జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధుల్లో ప్రమాదకరమైన వ్యాధి రేబిస్. ప్రధానంగా పిచ్చికుక్కుల కాటు వల్ల కలిగే వ్యాధి ప్రాణాంతకమైంది. ముందు జాగ్రత్తగా వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు యాంటీ రెబీస్ టీకాలు వేయించడంతోపాటు కుక్కకరిచిన ప్రతి ఒక్కరికీ ఈ వ్యాక్సిన్ వేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, పశువులకు కూడా ఈ వ్యాధి సోకి చాలా సంఖ్యలో మూగజీవాలు చనిపోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచారు.
పశువుల్లోనూ వ్యాధి గుర్తింపు..
రేబిస్ వ్యాధి పశువులకు కూడా సోకుతుంది. గేదెలు లేదా ఆవులు చొంగ కార్చ డం, తలను గోడకు కొట్టుకోవ డం, కొట్టంలోని ఇతర వస్తువులను ఢీకొట్టడం, తరచూ మూత్రం పోయడం, గట్టిగా అరవడం, రంకె వేయడం, మేత మేయకపోవడం, కనుగుడ్లు తిప్పడం, జర్వం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉండి గుర్తించకపోతే వారం, పది రోజుల్లో చనిపోతాయి.

మనుషుల్లోనూ వ్యాధి లక్షణాలు..
మనుషులకు ఈ వ్యాధి సోకితే నీళ్లును చూసి భయపడడం, శరీరంలోని కండరాల్లో విపరీతమైన నొప్పి, ప్రవర్తనలో మార్పు, వ్యాధి ముదిరిన కొద్ది శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం, చివరకు శ్వాస ఆడక వ్యాధి లక్షణాలు కనిపించిన వారం రోజుల్లో చనిపోవడం జరుగుతుంది. ఒకసారి వ్యాధికారక వైరస్ మనిషి శరీంలోని నరాల్లో ప్రవేశించినైట్లెతే వ్యాధి సోకకుండా కాపాడడం అసాధ్యం.
పిచ్చికుక్కలతోనే వ్యాప్తి..
రేబిస్ వ్యాధికి సంబంధించిన వైరస్ పిచ్చికుక్కల ద్వారా వస్తుంది. ఆ వైరస్ ఉన్న కుక్క మనిషినిగానీ, జంతువునుగానీకరిస్తే వ్యాధికారక క్రిము లు శరీరంలోకి ప్రవేశించి వ్యాధి ని కలుగజేస్తాయి. కుక్క నోటి నుంచి వచ్చే సలైవా(చొంగ, జొల్లు) ద్వారా ఈ వ్యాధి వస్తుంది. మనిషి శరీరంపై ఏదైనా గాటును నాకినా శరీరంలోకి ప్రవేశించి వ్యాధి బారినపడే అవకాశం ఉన్నది.
పెంపుడు కుక్కులతో జాగ్రత్త..
చాలా మంది కుక్కలను ఇష్టపూర్వకంగా పెంచుకుంటారు. కానీ వాటి ద్వారా రేబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. నివారణకు ముందు జాగ్రత్తగా టీకా వేయించాలి. చాలా మందికి అవగాహన లేక పట్టించుకోవడం లేదు. వీటితోపాటు గేదెలు, ఆవులకు కూడా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
అందుబాటులో వ్యాక్సిన్..
యాంటి రేబిస్ వ్యాక్సిన్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జనరల్ దవాఖాన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నిల్వ ఉన్నాయి.
వ్యాధిని గుర్తించడం ఎలా..
కుక్కల్లో ఈ వ్యాధిని తేలిగ్గా గుర్తించవచ్చు. కుక్క నోటిలో నుంచి చొంగ కారడం, నాలుక బయట పెట్టడం, మతిలేకుండా తిరగడం, కనబడిన వస్తువులు, మనుషులను, పశువులను ఇతర కుక్కలను కరవడం చేస్తాయి. అంతేకాకుండా వాటి ఆరుపులో మార్పు వస్తుంది. తిండి తనకపోవడం, నిశ్శబ్దంగా ఒకే చోట పడుకొని ఉండడం, పక్షవాతం రావడం, చివరకు 7 నుంచి 10 రోజుల్లో ఆ కుక్క చనిపోతుంది.
తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలి..
రెబీస్ వ్యాధిని నివారించేందుకు ప్రతి కుక్క, గేదె, ఆవులకు కచ్చితంగా ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ఈ వ్యాధి చికిత్స అందుబాటులోకి రాలేదు. అందుకే ముందస్తు జాగ్రత్తలు చాలా అవసరం. ముఖ్యంగా పెంపుడు కుక్కలకు 12 వారాల్లో ఒక డోస్, 10వ వారంలో రెండో డోస్, సంవత్సరం తర్వాత మడో డోసు టీకాలు వేయించాలి. అదేవిధంగా వ్యాధి సోకిన కుక్కకు, పశువులకు మొదటి రోజు, 3వరోజు, 7వరోజు, 11వరోజు, 28వరోజు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన కుక్క, పశువులు చనిపోతే వాటిని కాల్చడం, గుంతతీసి పూడ్చి పెట్టాలి.
– డాక్టర్ విజయలక్ష్మి, పశువైద్యాధికారి, కోస్గి
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

