గద్వాల, ఏప్రిల్ 14 : గ్రామీణ ప్రా ంతాల్లో పల్లెవెలుగు బస్సులు కనిపించ డం లేదు. పూర్తిస్థాయి లో రోడ్డు, బస్సు సౌక ర్యం కల్పించకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. కొన్ని గ్రామాలైతే ఇప్పటి వరకు బస్సు మొఖమే చూడలేదు. చేసేది లేక బైక్‌లు, ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వీటిల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుంటున్నారు. కానీ విద్యార్థులు పడుతు న్న బాధలు వర్ణణాతీతం. బస్సు సౌకర్యం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం పలుమార్లు ఆందోళనలు సైతం చేపట్టారు. ఈనెల 5వ తేదీన పెద్ద ధన్వాడ గ్రామస్తులు ప్లకార్డులు ధరించి రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రస్తుత సమాజంలో చదువుకు విలువ, గౌవరం ఉన్నది. అయితే ఇతర ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌ కర్యం లేక చాలా మంది చదువుకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారు. గ్రామాల్లో ప్రాథమిక విద్యాభ్యా సం పూర్తి చేశాక హైస్కూల్‌కు వెళ్లాలన్నా.. కళాశాలలకు వెళ్లాలన్నా రవాణా సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు. కొందరు సొంత వాహనాలలో.. మ రికొందరు ప్రైవేటు వాహనాలలో.. ఇంకొందరు కి. మీ. చొప్పున నడవాల్సిన పరిస్థితి. గట్టు వంటి మండలంలో సీడ్ పత్తి సీజన్ సమయంలో రెండు నెలలు పాటు విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లడం లేదు. సౌకర్యా లు లేక కొంతమంది వి ద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేసి పొలంబాట పడుతున్నారు. ప్రతి ఏడాది అ ధికారులు బడిబాట చేపట్టి బడికి రాని విద్యార్థుల ను స్కూళ్ల వైపునకు తీసుకెళ్తున్నా వారు తిరిగి పనులకు వెళ్తున్నారు.
జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా.. సుమారు 100కుపైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. విద్యార్థులు బడులకు వెళ్లడానికి అవస్థలు పడుతున్నారు. గద్వాల ఆర్టీసీ డిపో పరిధిలో 105 బస్సులు ఉన్నాయి. అందులో గ్రామాలకు వెళ్లే పల్లెవెలుగు బస్సులు 42 మాత్రమే ఉన్నాయి. పాలకులు మాటలు చెబుతున్నారే తప్పా బస్సు సౌకర్యం కల్పించకపోవడంతో వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అదునుగా భావించిన ప్రైవేట్ పాఠశాలల యజమానులు బస్సులు తిరగని గ్రామాలకు తమ బస్సులను పంపి ఎక్కువ మొత్తంలో విద్యార్థులు స్కూళ్లల్లో చేరేలా చూస్తున్నారు. జిల్లాలో మొత్తం 461 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 285 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలు 94 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆయా మండలాల్లో పరిధిలోని గ్రామాలకు బస్సులు వెళ్లకపోవడంతో ఆయా గ్రామాల విద్యార్థులు సమీప పాఠశాలలకు కాలినడకన, ఆటోలు, సైకిళ్లపై వ్యయ ప్రయాసాలకోర్చి చదవుకోవడానికి పాఠశాలలకు వెళ్తున్నారు.
కాలం మారింది.. పాలకులు మారుతున్నారు.. ప్రభుత్వాలు మారుతున్నాయి.. కానీ పల్లెలకు ఉన్న రోడ్లు మారడం లేదు. బస్సు సౌకర్యానికినోచుకోవడం లేదు. అయినా పట్టించుకునే నాథుడే లేడన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనెల 5వ తేదీన పెద్దధన్వాడ గ్రామస్తులు ప్రధాన రహదారిపై మోకాళ్లపై కూర్చొని ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు తమ పిల్లలు వెళ్లలేక బడి, కళాశాల మానేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పాలకులకు కనువిప్పు కలగడం లేదు. ఇప్పటికైనా బస్సు సౌకర్యం కల్పించాలి.
గద్వాల మండలంలో.. చెనుగోనిపల్లి, కొత్తపల్లి, మేళచెర్వు, కాకులారం, ఈడ్గోనిపల్లి, కుర్వపల్లి , పర్మాల, పూడురు తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేక పోవడంతో వీరు తమ గ్రామం నుంచి 2కిలోమీటర్ల మీర స్టేజీ వరకు వచ్చి బస్సులు ఎక్కి సమీప పాఠశాలలకు వెళ్తుండగా మరి కొందరు సైకిళ్లపై వెళ్తున్నారు.
గట్టు మండలంలో.. తారాపురం, జోగన్‌గట్టు, సల్కాపురం, గంగిమాన్‌దొడ్డి, సోంపురం, కుచినెర్ల, జోహారపురం, రాయపురం, ఎల్లందొడ్డి గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నత పాఠశాల చదువులు చదవాలంటే గట్టు లేదా మాచర్లకు వెళ్లాలి. వీరు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన లేదా సైకిళ్లు ఆటోల్లో స్కూల్‌కు వెళ్తున్నారు.
కొతులగిద్ద, కొత్తపాలెం, జీరబండ, గుర్రంపల్లి, చిన్నపాడు విద్యార్థులు వారి గ్రామాల స్టేజీ వరకు వచ్చి ధరూర్ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు.మల్దకల్ మండలంలో.. నాగర్‌దొడ్డి, విఠలాపురం, కుర్తిరావులచెర్వు, అడవిరావుల చెర్వు, చిప్పదొడ్డి విద్యార్థులు వారి గ్రామం నుంచి మూడు కిలోమీటర్లు స్టేజీ దగ్గరకు వచ్చి మల్దకల్‌లోని పాఠశాలకు రావాల్సిన పరిస్థితి నెలకొన్నది.కేటిదొడ్డి మండలంలో.. ఎర్సన్‌దొడ్డి, సుల్తాన్పురం, కుచినెర్ల, గువ్వలదిన్నె, పాగుంట, పాతపాలెం, మైలగడ్డ, రంగాపురం గ్రామాల విద్యార్థులు ఐదు కిలోమీటర్ల మేర కాలినడకన, ఆటోలు,బైక్‌లపై నందిన్నె, చింతలకుంట ఉన్నత పాఠశాలలో చదువుకోవడానికి వెళ్తున్నారు.
అలంపూర్ మండలంలోని.. ర్యాలంపాడ్, జిల్లెలపాడ్ సుల్తానపురం, బుక్కాపురం రాజోళి మండలంలో.. తూర్పుగార్లపాడ్, పడమటి గార్లపాడ్, మాన్‌దొడ్డి, చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, నసనూర్ పెద్దతాండ్పాడ్, ముండ్లదిన్నె మానవపాడు మండలంలో.. కొర్విపాడ్, చిన్నపోతులపాడు, పెద్దపోతులపాడ్, మద్దూరు, గోకులపాడ్ ఇటిక్యాల మండలంలో.. వావివాల, షాబాద్, వల్లూరు, ధర్మారం, శనగపల్లి, శివనంపల్లి, బుడ్డారెడ్డిపల్లి ఉండవెళ్లి మండలంలో.. కంచుపాడ్, తక్కశిల, ప్రాగటూర్, శేరిపల్లి, మారమునగాల, భైరాపురం, బస్వాపురం అయిజ మండలంలో.. సంకాపురం, ఈడ్గోనిపల్లి, రాజపురం, కొత్తపల్లి, కిసాన్‌నగర్, ఉప్పల, ఉప్పలక్యాంపు, జడ్దొడ్డి, గుడిదొడ్డి, రాజాపురం గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికైనా పాలకులు,ప్రభుత్వాలు స్పందించి ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.