నవాబ్‌పేట, ఫిబ్రవరి 23 : నవాబ్‌పేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం రైతులు భారీగా వేరుశనగ ధాన్యం తీసుకొచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో సంత ఉండడం, టెం డర్లు సమయానికి అవుతాయనే ఉద్దేశ్యంతో రైతులు పెద్దఎత్తున వేరుశనగ ధాన్యాన్ని తీసుకొచ్చారు.
ఒక్కరోజే 11,136 బ్యా గుల వేరుశ నగ ధాన్యం వచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి రమేశ్‌కుమార్ తెలిపారు. క్వింటాకు గరిష్ఠంగా రూ.6,769, కనిష్ఠంగా రూ.5,020 ధర లభించినట్లు వివరించారు. అలాగే చింతపండుకు క్వింటాకు గరిష్ఠంగా రూ.10,001 ధర పలికినట్లు ఆయన పేర్కొన్నారు. సమయానికి టెండర్లు వేసి కొనుగోలు చేసినట్లు మార్కెట్ కార్యదర్శి తెలిపారు.