మక్తల్ : స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డుకు చెందిన ఎరుకలి శివరాజ్ ఆధ్వర్యంలో చందాపురం గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన చెందిన కార్యకర్తలు మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Chittem Rammohan Reddy ) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ( BRS) లో చేరారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మక్తల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. ఇచ్చిన మాట తప్పిన పార్టీకి బుద్ధి రావాలంటే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. మక్తల్ మున్సిపాలిటీని తీసుకువచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి నరసింహ గౌడ్, పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, ప్రధాన కార్యదర్శి సందాపురం అశోక్ కుమార్ గౌడ్, తిర్మాలపూర్ కృష్ణ యాదవ్, సిరిపేరాములు ఆంజనేయులు గౌడ్, కుర్మన్నయాదవ్ , దొడ్డి రామలింగం, సిరిపే మోనేష్, దొడ్డి గోవిందు, నాగరాజు గరాజు వాబీ, బాబు, నర్సింహా, ఎరుకలి ఉసేనప్ప తదితరులు పాల్గొన్నారు.