గద్వాల అర్బన్, మే 15 : ప్రభుత్వ దవాఖానల్లో వి ధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బంది తీరు మార్చుకోవాలి.. రోగులపై శ్రద్ధ వహించాలి.. అని తెలంగాణ రా ష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆయన బుధవారం తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలు, చికిత్సలు, వసతులపై ఆరా తీశారు. వార్డుల పరిశీలన అనంతరం వైద్యులు, సిబ్బందికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హె చ్చరించారు. సీనియర్ వైద్యులు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని.. దవాఖానలో సరైన నిర్వహణ లేదని రోగులు చెబుతున్నారన్నారు. ఈ విషయంపై వైద్యులు, సిబ్బందిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. దవాఖాన పరిసరాలు పరిశుభ్రం గా ఉంచుకోవాలని, రోగులపై శ్రద్ధ చూపాలని సూచించారు.
గూడెం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవానికి రాగా పురిట్లోనే శిశువు మృతి చెందిందని తెలుసుకున్న కమిషనర్ వైద్యుల పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దవాఖానకు వచ్చే ప్రతి రోగికి బాధ్యతగా చికిత్స చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది ఉన్నారు.