మహబూబ్‌గర్, మే 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరును వర్షం ముంచెత్తింది. జిల్లా కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున 6 నుంచి ఉదయం 9 గంటల వరకు ఏకధాటిగా పడింది. దీంతో పట్టణంలోని కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభా వంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే హెచ్చ రించింది. ఈ నేపథ్యంలో కురిసిన వర్షంతో జిల్లా కేంద్రం అతలాకుతలమైంది. పాలమూరు యూ నివర్సిటీ నుంచి అప్పనపల్లి బ్రిడ్జి వరకు ప్రధాన రహదారిపై నీళ్లు చేరడంతో కాల్వను తలపిం చింది.
ప్రధాన రహదారి చుట్టుపక్కల షాపింగ్ కాంప్లెక్స్‌లలో నీరు చేరింది. దీంతో వ్యా పారస్తు లకు తీవ్ర నష్టం కలిగింది. బీకే రెడ్డి, శ్రీరామ్‌నగర్ కాలనీతోపాటు రామయ్యబౌలి తదితర ప్రాంతా ల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ మయ్యా యి. నగరపాలక సంస్థ కార్యాలయం జల దిగ్బం ధంలో చిక్కుకున్నది. క్రిస్టియన్‌పల్లి సమీపంలోని దివ్యాంగుల కాలనీలో అధికారులు ఇండ్లను కూల్చడంతో శిథిలాల కిందే వాళ్లంతా బతుకు జీవుడా అని జీవిస్తున్నారు. భారీ వర్షానికి వార ంతా శిథిలాల మధ్యనే గడపడంతో వారి వేదన వర్ణణాతీతం. అనేక కాలనీలో డ్రైనేజీలు పొంగిపొర్లడం తో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
నగర పాలక సంస్థ కార్యాలయానికి ఫోన్లు చేస్తే స్పందించలేదు. దీంతో మాజీ ప్రజాప్రతినిధులకు మా కాలనీలోకి నీళ్లు వచ్చాయని ఫిర్యాదులు చేశారు. బస్టాండ్, న్యూటౌన్, అశోక్ టాకీస్ చౌరస్తా, పద్మావతి కాలనీ వద్ద రహదారులపై వరద ప్రవహించింది. మూడ్రోజుల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయేందిరబోయి సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించి అధికారులకు సహాయక చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షంతో జిల్లా కేంద్రం అతలా కుతులమవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలకు వినిపించాయి.
3 గంటల పాటు ఏకధాటిగా..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వర్షం క్రమక్రమంగా భారీగా మారి 9 గంటల వరకు కురిసింది. డ్రైనేజీలు, రోడ్లపై వరద ఉప్పొంగడంతో ఇండ్ల నుంచి ప్రజలు బయటికి రాలేకపోయారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో జనం బయటకు తో డడానికి తంటాలు పడ్డారు. బైపాస్ రహదారి కూడా జలమయం కావడంతో వాహనాల రాకపోలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రభు త్వ దవాఖాన ఎదుట.. పాత కలెక్టరేట్ వద్ద న్యూటౌన్, మెట్టుగడ్డ ప్రాంతాల్లో రహదారిపై నీళ్లు కాల్వలను తలపించాయి. వర్షపు నీరు చేరడంతో వాహనాలు రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.
శిథిలాల కిందే తడుస్తూ.. దివ్యాంగులు
గతేడాది రెవెన్యూ అధికారులు పాలమూరులోని 523 సర్వేనెంబర్లో దివ్యాంగుల కాలనీలో దివ్యాంగుల ఇండ్లను కూల్చారు. వారంతా ఆ శిథిలాల కిందే నేడు జీవనం సాగిస్తున్నారు. అయితే భారీ వర్షంతో ఇండ్ల శిథిలాల మధ్య అవస్థలు పడటం పలువురిని కలిచివేసింది. నిలువ నీడ లేకుండా చేశారని అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం తలదాచుకోవడానికైనా అధికారులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నగర పాలక సంస్థ కార్యాలయం జలదిగ్బంధం
పాలమూరులోని నగర పాలక సంస్థ కార్యాలయం కురిసిన వర్షంతో జలదిగ్బంధానికి గురైంది. ప్రజల రక్షణ మా బాధ్యత అంటున్న అధికారిక కార్యాలయంలోనే మురుగు ముందుకు పారే దారి లేకపోవడం విడ్డూరం. ఇటీవల నగర పాలక సంస్థ కార్యాలయం ముందు భారీగా వెలిసిన షాపింగ్ కాంప్లెక్స్‌ల కోసం హడావిడిగా సీసీ రోడ్ల వేశారు. వీధి వ్యాపారాలను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ యజమానుల కోసం రహదారి వెడల్పు చేశారు. నగరపాలక సంస్థకు చెందిన ప్రహరీని సైతం కూలగొట్టి లోపలి వరకు మళ్లా నిర్మించారు.
ఇంత చేసినా వర్షానికి నగరపాలక సంస్థ కార్యాలయం మొత్తం జలమయమైంది. వర్షపు నీరు వెళ్లడానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో నీరంతా కార్యాలయాన్ని చుట్టిముట్టింది. దీంతో లోపలికి అడుగుపెట్టలేని పరిస్థితి. ఇంత జరిగినా నగర పాలక సంస్థ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయి. ఉదయం 11 గంటలకు కార్యాలయానికి తాపీగా చేరుకున్నారు. కాగా గడియారం చౌరస్తా కూడా వర్షానికి జలమయంగా మారింది.
వరద నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోండి : కలెక్టర్ మహబూబ్‌నగర్
నగర పాలక సంస్థ పరిధిలో వర్షపు నీరు నిలిచి లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ని వర్షపు నీటి కాల్వను నగర పాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. రాబో వు వర్షాకాలంలో వర్షాలతో ముంపు ప్రాం తాలు జలమయం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించా రు. వానలతో ప్రాణ, ఆస్తి నష్టం లే కుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నా రు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్ర తాప్, నగర పాలక సంస్థ క మిషనర్ మహేశ్వర్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయ్ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.