ముసురేసింది..
మాండస్ తుఫాన్ ప్రభావంతో ముసురు కురుస్తున్న ది. మూడురోజులుగా చిరుజల్లులు కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది.
- మాండస్ తుఫాన్ ప్రభావంతో చిరుజల్లులు
- చలిగాలులతో గజగజ వణుకుతున్న ప్రజలు
జడ్చర్లటౌన్, డిసెంబర్ 12 : మాండస్ తుఫాన్ ప్రభావంతో ముసురు కురుస్తున్న ది. మూడురోజులుగా చిరుజల్లులు కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. సోమవారం వాతావరణం మరింత చల్లబడడం తో జడ్చర్ల పట్టణ ప్రజలు స్వెటర్లు, టోఫీలు ధరించి బయటకు వెళ్లడం కనిపించింది. తుఫాన్ కారణంగా ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ఓవైపు చలి, మరోవైపు ముసురు కురుస్తుండటంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే పట్టణ రహదారులు సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారాయి. తుఫాన్ ప్రభావంతో మరో రెండురోజులు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూ చిస్తున్నారు.
రైతుల అవస్థలు
మిడ్జిల్, డిసెంబర్ 12 : మాండస్ తుఫా న్ ప్రభావంతో చిరుజల్లులు కురుస్తుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వ్య వసాయ పొలాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడవకుండా కాపాడుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పుతున్నారు. అయినప్పటికీ ధాన్యం తడుస్తున్నదని పలువురు రైతు లు వాపోతున్నారు. కాగా ముసురుతో వా తావరణం చల్లబడడంతో వృద్ధులు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, డిసెంబర్ 12 : మండలంలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులతో కూడిన ముసురు కురుస్తుండడంతో చలి తీవ్రత పెరిగింది. అలాగే రైతులు పండించి న ధాన్యం కల్లాలు, మార్కెట్‌యార్డులో తడిసిపోయింది. ధాన్యం తడవకుండా రైతులు నానా అవస్థలు పడ్డారు. నవాబ్‌పేట మార్కెట్‌యార్డులో ఉన్న ధాన్యంపై రైతులు, మార్కెట్ సిబ్బంది కవర్లు కప్పి జాగ్రత్తలు తీసుకున్నారు. రైతులు కల్లాల్లో ధాన్యంపై టార్పాలిన్లు కప్పారు. కాగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, డిసెంబర్ 12 : మాం డస్ తుఫాన్ ప్రభావంతో ముసురు కురువడం, చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, వృ ద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇండ్ల నుంచి జనం బయటకు వచ్చేందుకు జంకే పరిస్థితి నెలకొన్నది. వర్షానికి ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంతో గండీడ్, మహ్మదాబాద్ మండలాల్లో జనజీవనం స్తంభించింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

