AUS vs BAN | నంబర్ 1 జట్టుపై నిప్పులు చెరిగిన హసన్.. 198కే ఆస్ట్రేలియా ఆలౌట్..!
AUS vs BAN : వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్(6-55) వణుకు పుట్టించాడు. 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాకు భరోసానిస్తూ.. ఈ స్పీడ్‌స్టర్ వికెట్ల వేటతో ఆసీస్‌ను పడగొట్టాడు.
AUS vs BAN : వరల్డ్ నంబర్ 1 ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్(6-55) వణుకు పుట్టించాడు. 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాకు భరోసానిస్తూ.. ఈ స్పీడ్‌స్టర్ వికెట్ల వేటతో ఆసీస్‌ను పడగొట్టాడు. స్టీవ్ స్మిత్(71) ఒంటరి పోరాటం చేసినా.. మహమూద్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడంతో కంగారూ టీమ్ కోలుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా ఇంకా వెనకబడి ఉంది.
ప్రపంచ నంబర్ 1 టెస్టు టీమ్ ఆస్ట్రేలియా తడబడింది. సొంతగడ్డపై చెలరేగే ఆసీస్ బ్యాటర్లు బంగ్లాదేశ్ పేస్ దళానికి దాసోహమయ్యారు. డార్విన్ స్టేడియంలో హసన్ మహమూద్(6-55) ఆరు వికెట్లతో రెచ్చిపోగా ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ నత్తనడకలా సాగింది. సహచరులు ఇలా వచ్చి అలా వెళ్లగా.. స్టీవ్ స్మిత్(71) క్రీజునంటుకున్నాడు. కానీ, స్కోర్ మాత్రం రెండొందలు దాటించలేకపోయాడు. తస్కిన్(2-55), హసేన్(2-39)లు సైతం విజృంభించగా కంగారూ టీమ్ 198 పరుగులకేకుప్పకూలింది.
𝐒𝐢𝐱 𝐰𝐢𝐜𝐤𝐞𝐭𝐬. 𝐎𝐧𝐞 𝐮𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐬𝐩𝐞𝐥𝐥. 🥵#HasanMahmud tore through Australia with a career-best 6/55! 💪#AUSvBAN pic.twitter.com/l09igPB7gu
— Star Sports (@StarSportsIndia) August 13, 2026
ఆస్ట్రేలియాను స్వల్ప స్కోర్‌కే పరిమితం చేసిన బంగ్లాదేశ్ బౌలర్ల నమ్మకాన్ని బ్యాటర్లు నిలబెట్టారు. పటిష్టమైన కంగారూ బౌలింగ్ దళాన్ని ఎదుర్కొన్న ఓపెనర్లు శుభారంభమిచ్చారు. షద్నాన్ ఇస్లాం(20)ను మిచెల్ స్టార్క్ ఔట్ చేసి ఆసీస్‌కు తొలి వికెట్ అందించాడు. అనంతరం మొమినుల్ హక్(35 నాటౌట్), తంజిద్ హసన్ తమీమ్(32 నాటౌట్)లు ఆచితూచి ఆడారు. ఫలితంగా మొదటి రోజు ఆట ముగిసే సరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 102 పరుగులు వెనకబడి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

