భారీ వర్షం
మండలంలోని వివిధ గ్రామా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. నవాబ్‌పేట, రుద్రారం, యన్మన్గండ్ల, రుక్కంపల్లి, ఇప్పటూర్, లోకిరేవు, లింగంపల్లి, చాకలిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో స్థానిక మార్కెట్‌యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది.
నవాబ్‌పేట, మే 6 : మండలంలోని వివిధ గ్రామా ల్లో శనివారం భారీ వర్షం కురిసింది. నవాబ్‌పేట, రుద్రారం, యన్మన్గండ్ల, రుక్కంపల్లి, ఇప్పటూర్, లోకిరేవు, లింగంపల్లి, చాకలిపల్లి, కొండాపూర్ తదితర గ్రామాల్లో సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షంతో స్థానిక మార్కెట్‌యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులు ఇటీవలే రైతులు పంటకోతలు చేపట్టి ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మార్కెట్‌యార్డులో కొందరు రైతులు ధాన్యా న్ని ఆరబోసుకోగా, మరికొందరు కుప్పలుగా పోశారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ధాన్యం పూర్తిగా తడిసింది. ఆరబోసిన ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నీటి లో ధాన్యం కొట్టుకుపోకుండా అష్టకష్టాలు పడ్డారు. కాగా భారీ వర్షంతో చాలా గ్రామాల్లో వరి చేనులోకి నీరు వచ్చి చేరింది. దీంతో వరికోతలు మరో ఐదారు రోజులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
మూసాపేట మండలంలో..
మూసాపేట, మే 6 : మండలంలోని నిజాలాపూర్, కొమిరెడ్డిపల్లి, జానంపేట తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. పలుచోట్ల వర్షపు నీటిలో ధాన్యం కొట్టుకుపోయింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు, పరుగులు పెట్టారు. ఆరబెట్టిన ధాన్యాన్ని అమ్ముకునే సమయంలో వర్షం రావడంతో ఆవేదనకు గురయ్యారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, మే 6 : జడ్చర్ల మండలంలో శనివారం మోస్తారు వర్షం కురిసింది. సాయంత్రం ఒక్కసారిగా వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. అకాలవర్షంతో వరికోతలు నిలిచిపోయాయి. చేతికొచ్చిన పంట లు వర్షానికి తడిసి నేలకొరిగాయి. నూర్పిళ్లు చేసిన ధా న్యం ఆరబెట్టేందుకు రైతులకు ఇబ్బందిగా మారింది.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

