మరికల్, ఏప్రిల్ 18: మరికల్, ధన్వాడ మండలాల్లో గురువారం సాయంత్రం నుంచి 7గంటల వరకు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ధన్వాడ మండలంలోని మందిపల్లి వద్ద చెట్లు రోడ్డుపై పడడంతో సుమారు గంటపాటు ట్రాఫిక్జామ్ అయ్యింది. ఆకస్మికంగా గాలులు, ఉరుములతో భారీ వర్షం కురవడంతో అక్కడక్కడ చేతికొచ్చిన వరి పంట నేలపాలైంది.