మహబూబ్నగర్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తొత్తినోని దొడ్డి గ్రామంలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
తొత్తినోని దొడ్డి గ్రామంలో పెద్దవాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు తెగిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది.
నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, వాగులు దాటేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.