మూసాపేట, జూన్ 4 : ఉరుకుల పరుగుల జీవితంలో అనారోగ్య సమస్యలతో అనేక మంది సతమతమవుతున్నా రు. 35ఏండ్ల నుంచే బీపీ, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో చిరుధాన్యాలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇందులో ముఖ్యంగా జొన్నరొట్టెకు డిమాండ్ పెరిగింది. దశాబ్ద కాలంలో అత్యధికంగా డిమాండ్ పెరిగిన పంటల్లో జొన్న ఒకటి. ప్రస్తుతం పల్లె-పట్టణం, పేద-ధని క తేడా లేకుండా అందరూ జొన్నరొట్టె తినేందుకే ఎక్కువ గా ఆసక్తి చూపుతున్నారు. పూర్వం ప్రతి రైతు జొన్నలు, తైదలు పండించేవారు. వాటితో ఏడాది పొడవునా రొట్టె, సం కటి చేసుకొని తినేవారు. అందుకే వారికి 70, 80 ఏండ్లు వచ్చినా బీపీ, షుగర్ వంటి వ్యాధులు వచ్చేవికావు. వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉంటూ తమ పనులు చేసుకునేవారు. సన్న బియ్యం వచ్చిన తర్వాత అందరూ జొన్న, తై ద పంటలు పండించేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో మూడు దశాబ్దాలుగా అందరూ రొట్టెలను పక్కన పెట్టి మూ డుపూటలు అన్నం, బియ్యంతో తయారు చేసిన ఇడ్లీలు, దోశ తింటూ వస్తున్నారు.
దీంతో ప్రస్తుతం ఆరోగ్యం ఆవిరైపోయింది. 35ఏండ్లు దాటితే బీపీ, షుగర్ వంటి వ్యాధులతో పాటు స్థూలకాయం, గుండెజబ్బులతో నిత్యం సతమతమవుతూ జీవనం సాగిస్తున్నారు. వైద్యుడిని సంప్రది స్తే ఎక్కువగా జొన్న రొట్టె తినాలని, రాగి జావా తాగాలని సూచిస్తుండడంతో రెండేళ్లుగా మార్కెట్లో జొన్నరొట్టెకు డి మాండ్ పెరిగింది. ప్రస్తుత సమాజంలో 40 ఏండ్లు దాటిన 60శాతం మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. రొట్టె తినడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుందని తెలియడంతో వ్యాధిగ్రస్తులతోపాటు మిగతా వారు కూడా రొ ట్టెలపై ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో రొట్టెలు చేసే మహిళలకు జీవనోపాధి లభిస్తున్నది. ప్రతి రోజూ ఉద యం, సాయంత్రం రోడ్ల పక్కన కట్టెల పొయ్యిలు పెట్టి వ చ్చిన వారికి వేడివేడి రొట్టెలు చేసి ఇస్తున్నారు. ఇలా చాలా కుటుంబాలు రొట్టెల తయారీతో కుటుంబ పోషణ చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా జొన్న సాగు తగ్గిపోయింది. గ్రా మాల్లో ఆశించిన స్థాయిలో పంట సాగుకాకపోవడంతో ది గుబడి చాలా తగ్గింది. దీంతో జొన్నలకు రోజురోజుకూ డి మాండ్ పెరుగుతూ వస్తున్నది.
గతంలో జొన్నలు క్వింటాకు ధర రూ.3వేల నుంచి రూ.5వేల మధ్య ఉండేది. గతేడాది రూ.8వేల నుంచి మే లు రకం(చెలుక పచ్చ) జొన్నలకు రూ.11వేల వరకు ధర పలికింది. అంటే జొన్నలకు డిమాండ్ డబుల్ పెరిగింది. ఈ కాలంలో రైతులు జొన్న పంట సాగు చేస్తే మంచి లా భాలు పొందవచ్చు. ఆరుతడి పంటల్లో జొన్న పంటకే పెట్టుబడి, శ్రమ తక్కువగా ఉంటుంది. మిగతా పంటల రాబడితో పోలిస్తే జొన్నలోనే మంచి లాభాలు వస్తాయని రైతులు చెబుతున్నారు. అంతేకాక పంటను అమ్ముకునేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడాల్సిన అసవరం ఉండదు. వారి వద్దకే వ్యాపారులు వెళ్తారు. రైతులు జొన్న పంటను సాగు చేయడం వల్ల లాభం పొందడంతోపాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారు. రైతులు ఈ సీజన్లో జొన్న పంట సాగుకు ఆసక్తి చూపాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.