కోడేరు, జూలై 15 : సర్ డిజిటలైజేషన్‌కు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి సహకారం అం దించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. మండల కేంద్రం, రాజాపూర్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన సర్ అవగాహన సదస్సులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ డిజిటలైజేషన్ ప్రక్రియలకు బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్గర ఉండి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బీఎల్ఏలకు పూర్తి సహకారం అందించాలని సూచించారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండలంలో రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేయకుండానే చేశామని అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్, సర్పంచులు నాగేశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.