Harsha Sai | మిడ్జిల్ ఫిబ్రవరి 18 : కొందరు దుండగులు యూట్యూబర్ హర్ష సాయి (Harsha Sai) మనుషులమంటూ డబ్బులు కాజేశారు. తాము హర్షసాయి మనుషులమని సహాయం చేస్తామని నమ్మించి ఏకంగా రూ. 17వేలు కాజేసిన ఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుడి వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన బరిగెల ఆంజనేయులు తండ్రి జంగయ్య గత సంవత్సరం జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి మందులు వాడుతున్నాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంజనేయులు హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సహాయం కావాలని కామెంట్ పెట్టాడు.
రూ.4 లక్షలు సహాయం చేస్తామని..
ఇదే అదనుగా భావించిన దుండగులు హర్షసాయి ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని రూ.4లక్షల సహాయం చేస్తామని ఇన్స్టా లో ఆంజనేయులును నమ్మించారు. డాక్యుమెంట్ చార్జెస్, ఆఫీస్ బ్యాక్ ఎండ్ చార్జెస్ ఉంటాయని అవి మీరు రెడీ చేసుకొని.. మేము ఇచ్చిన నెంబర్కు మీరు ఫోన్ పే చేస్తే.. ఆ మరుక్షణమే హర్ష సాయి టీం మీకు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయాన్ని పంపుతారని నమ్మబలికారు.
ఇది నమ్మిన ఆంజనేయులు మంగళవారం సాయంత్రం వారిచ్చిన ఫోన్ నెంబర్కు ఐదు సార్లు 22వేల 500లను వారికి ఫోన్ పే ద్వారా పంపారు. సహాయం కోసం ఆంజనేయులు మళ్ళీ ఫోన్ చేస్తే కేవలం 5500 ఫోన్ పే చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆంజనేయులు పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Harsha Sai1
Warangal | కేంద్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ