ఒక్క పూటే..
ఒంటి పూట బడులకు వేళైంది. ఎండలు ము దురుతుండడంతో విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
- నేటి నుంచి ఒంటి పూట బడుల అమలుకు విద్యాశాఖ ఆదేశాలు..
నాగర్‌కర్నూల్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఒంటి పూట బడులకు వేళైంది. ఎండలు ము దురుతుండడంతో విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు ఒంటి పూట బడులు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో శుక్రవారం నుంచి పాఠశాలల్లో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిసే వర కూ ఈ ఒంటి పూటబడులు అమలు కానున్నాయి. ఈ వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. పది దాటితే బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దలు సైతం ఎండలకు తల్లడిల్లుతున్నా రు.
ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఒంటి పూ ట బడులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాలతో ఇకపై శుక్రవారం నుంచి వార్షిక పరీక్షలతోపాటు ఈ విద్యా సంవత్సరం ముగిసే వర కు ఒంటిపూట బడులు అమలు కానున్నాయి. పదో తరగతి విద్యార్థులకు ఈనెల 18నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించనున్నారు. కాగా, ఇప్పటికే విద్యార్థులకు సిలబస్ పూర్తి కావస్తోంది. పరీక్షలకు పునఃశ్చరణ చేసేలా ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వా త విద్యార్థులు ఇండ్లకు వెళ్లనున్నారు.
మధ్యాహ్న భోజనం అమలు జరిగేలా విద్యాశాఖ ఆదేశించిం ది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కొనసాగించాలని స్పష్టంగా సూచించింది. విద్యార్థులు ఉదయం అల్పాహారం చేసి స్కూళ్లకు రావాలని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్ల ల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని విద్యాశాఖ తెలియజేస్తున్నది. కాగా ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఒంటి పూట బడులు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ మధ్యాహ్నం పాఠశాలలు నిర్వహించరాదని, ఎవరైనా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని డీఈవోలు ఇప్పటికే హెచ్చరించారు.
విద్యార్థులు ఒంటిపూట బడులను ఆహ్లాదానికి కాకుండా పరీక్షల సన్నద్ధతకు ఉపయోగించుకోవాల్సిందిగా ఉపాధ్యాయులు సూచిస్తున్నా రు. గత ఏడాదిపాటు జరిగిన సిలబస్‌ను పూర్తిస్థాయిలో అభ్యసించాలని, పునఃశ్చరణ చేసుకోవాల ని, సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఇదిలా ఉంటే పదో తరగతి పరీక్షలకు నాలుగు రోజులే ఉండటంతో ఆ విద్యార్థులకు ప్రత్యేకంగా సందేహాలు నివృత్తి చేయనున్నారు. మొత్తమ్మీద ఒంటి పూట బడులు రావడంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమమవుతోండగా తల్లిదండ్రులు మాత్రం విద్యార్థుల ఆరోగ్యంపై జాగ్రత్త వహించాల్సి ఉన్నది.
వనపర్తి జిల్లాలో..
వనపర్తి టౌన్, మార్చి 14 : వనపర్తి జిల్లాలో 352 ప్రాథమిక, 57 ప్రాథమికోన్నత, 99 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గురుకులాలు, అన్ఎయిడె డ్, ప్రైవేట్ పాఠశాలలు కలిపి మొత్తం 735 పాఠశాలల్లో 91,101 మంది విద్యార్థులు చదువుతున్నారు.
టైం టేబుల్ ఇలా..
ఉదయం 7:45 గంటలకు బెల్లు ప్రారంభంకా గా 7:50 నుంచి 8 గంటల వరకు ప్రార్థన పూ ర్తయ్యి 10 గంటల వరకు మొదటి సెషన్ కొనసాగుతుంది. 20 నిమిషాలు విరామం తర్వాత 10:20 నుంచి 12:30 గంటల వరకు పాఠశాల త రగతులు కొనసాగనున్నాయి. ఇందుకు విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రా ల్లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

