నాగర్‌కర్నూల్, నవంబర్ 26 : ఎన్నో పో రాటాలు చేసి.. చావు అంచుల దాకా వెళ్లి తె లంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ వంటి మహనీయుడి ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అ ధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, దీక్షాదివస్ ఇన్చార్జి విజయసింహారెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి విలేకరుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ మలి విడుత తెలంగా ణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పో రాటాలు చేసినా.., ఎందరో బలిదానాలు చే సుకున్నా అప్పటి యూపీఏ సర్కారుకు కనువిప్పు కలగలేదని, తెలంగాణవాదాన్ని అణచివేయాలని కుట్ర చేసిందన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ప్రజ ల్లో పోరాట స్ఫూర్తిని నింపారని.. దానినే మ నం దీక్షాదివస్‌గా జరుపుకొంటున్నామన్నా రు. ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి భారీగా తరలివ చ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. నాడు తెలంగాణ పదాన్ని ఉచ్చరించని వారికి అప్పటి ఆంధ్రా నాయకత్వానికి తె లంగాణ ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారన్నా రు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా వారి శిష్యరికం తీసుకున్నాడని.., అందుకే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ నిర్బంధపాలన సాగిస్తున్నారన్నారు.
స్వేచ్ఛ నెలకొనాలంటే త్యా గాలు, ప్రజాపోరాటాలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీక్షాదివస్‌ను ని ర్వహించాలని ఆదేశించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదికాలం ఇవ్వాలని కేసీఆర్ సూచించారన్నారు. ప్రస్తుతం అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడితనం, అ హంకారం, దుర్మార్గాలపై ప్రజలు తిరుగుబాటుచేసే రోజులు దగ్గరపడ్డాయన్నారు. కేటీఆర్ పిలుపుమేరకు నాగర్‌కర్నూల్‌లోని పార్టీ కార్యాలయంలో 5 వేల మందికి తగ్గకుండా న భూతో న భవిష్యత్తు అనేరీతిలో దీక్షాదివ స్ చేపడుతామన్నారు. మాజీ ఎమ్మెల్యేలతో కలిసి విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్య క్రమాన్ని చేపడుతామన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం, నర్సింహ, చంద్రశేఖర్‌రెడ్డి, బాబురావు పాల్గొన్నారు.
దీక్ష ద్వారా తెలంగాణను సాధించుకున్న విషయం ప్రజలందరికీ తెలుసునని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి విజయసింహారెడ్డి తెలిపారు. 14 ఏండ్లపాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరోచితంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి రాష్ర్టాన్ని సాధించారన్నారు. సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు ఒక్కరూపాయి కూడా ఇచ్చేది లే దన్నాడని.., ఆ సమయంలోనే కేసీఆర్ ఎలాగైనా తెలంగాణ సా ధించాలని దీక్ష బూనారన్నారు. ఆ పోరాటాన్ని గుర్తు చేసుకునేందుకు దీక్షాదివస్ చేపట్టడం జరిగిందన్నారు.
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై ప్ర జలు నమ్మకం కోల్పోయారన్నారు. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి పదవినే అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఒక్కసారిగా ఏ విధంగా మారిపోయిందనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని, రేవంత్‌రెడ్డి చేతల ముఖ్యమంత్రి కాదని, నోటిదురుసు ఉన్న వ్యక్తి అని అన్నారు. పదవికి మచ్చతెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ ఆదేశాల మేరకు నాగర్‌కర్నూల్ తెలంగాణ భవన్లో 29న దీక్షాదివస్ నిర్వహిస్తున్నట్లు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీ రం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. త్యాగాలతో సాధించుకున్న రా ష్ట్రాన్ని పదేండ్లపాటు కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి 20 ఏండ్లు వెనక్కి పోయిందన్నారు. దీక్షాదివస్ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు.
కొల్లాపూర్ పట్టణాభివృద్ధికోసం రూ.25 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాలను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఎన్ని ఇ బ్బందులు ఉన్నా, కొవిడ్ విజృంభిస్తున్న సమయంలోనూ కేంద్రంతో మాట్లాడి కొల్లాపూర్ ప్రాంతానికి జాతీయ రహదారి తీసుకొచ్చామన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదన్నారు. తాము తీసుకొచ్చిన పాలిటెక్నిక్, హార్టికల్చర్ కాలేజీ ఊసే లేదన్నారు. మినీ లిఫ్ట్‌లు మంజూరు చేసినా వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.