లింగాల, ఫిబ్రవరి 11 : హామీలకు ఆశపడి కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలను గోస పెడుతుందని ఇలాంటి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం మండలంలోని రా యవరం గ్రామంలో బీఆర్ఎస్ మండల స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గువ్వల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అ డ్డగోలు హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చక అవస్థలు పడుతున్నదని ఎద్దేవా చేశారు. ము ఖ్యంగా అధికార కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నదని, అయినా వాటికి వెరవకుం డా నిలబడిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు.
పార్టీ శ్రేణులు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలతోపాటు ప్ర జలకు చేస్తున్న మోసాలను వివరించి స్థానిక ఎన్నికల్లో బీ ఆర్ఎస్ గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీ తిరుపతయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాయకులు శ్రీనివాసులుయాదవ్, సేవ్యానాయక్, చందు, శంకర్‌నాయక్, హన్మంతునాయక్, నర్సింహ, మద్దిలేటి, రానోజీ, శివ య్య, గోబ్రియా, తిరుపతయ్య, జగపతి తదితరులు పాల్గొన్నారు.