వనపర్తి టౌన్, సెప్టెంబర్ 9 : తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు (బాలురు) ప్రహరీ దూకి కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా.. వనపర్తి జిల్లా చిట్యాలలో ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే (బీసీ గురుకుల) పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కలెక్టర్కు వినతిప్రతం రాశారు.
‘ప్రిన్సిపాల్ గురువయ్య విద్యార్థులను దుర్భాషలాడుతున్నాడని, అవసరం లేకున్నా తల్లిదండ్రుల నుంచి రకరకాల వస్తువులు ఇప్పించడానికి డబ్బు లు కావాలని ప్రిన్సిపాల్లతోపాటు బోధన సిబ్బంది వసూలు చేస్తున్నారని.. పాఠశాలకు వచ్చే తల్లిదండ్రులతో.. ఉపాధ్యాయులతో తమను తిట్టిస్తున్నారు.. మెనూ ప్రకారం భో జనం అందించడం లేదని.. ఈ విషయాన్ని పలుమార్లు ప్రిన్సిపాల్, వార్డెన్ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.. చాలా మంది విద్యార్థులు మానసికంగా ఇ బ్బందులకు గురవుతున్నారు.. ప్రిన్సిపాల్, సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలి’..
అంటూ వినతిపత్రంలో వాపోయారు. ఈ పత్రంతో మంగళవారం ఉదయం 9:30 గంటల తర్వాత గురుకుల పాఠశాల ప్రహరీ దూకి 70 మంది పదో తరగతి విద్యార్థులు వినతిపత్రంతో వనపర్తి జిల్లా కేంద్రానికి పరుగులు పెట్టారు. పాఠశాల ఆవరణలోని పంట పొలాల మీదుగా వెళ్తుండడంతో విష యం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై వెంటనే విద్యార్థులను స్కూల్ సమీపంలోని పంట పొలాల్లో అడ్డగించారు. అదే సమయంలో అక్కడికి పలువురు నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విద్యార్థులకు ఆయన సర్దిచెప్పారు.
సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని నచ్చజెప్పడంతో ఒప్పుకున్న విద్యార్థులను పోలీస్ వాహనంలో తిరి గి పాఠశాలకు తీసుకెళ్లారు. కాగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోనే గుట్కా, ధూమపానం చేస్తున్నారంటూ.. పలువురు విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి మానసికంగా ఇబ్బందులకు ప్రిన్సిపాల్ గురిచేస్తున్నారని వాపోయారు. టీవీ, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు, టూర్లకు అవకాశం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన చెందారు. అయితే ప్రిన్సిపాల్ గురువయ్య ను సంప్రదించగా..
విద్యార్థులు బాగా చదివి మంచి ర్యాంక్ సాధించాలన్న ఉద్దేశంతో ప్రత్యేక దృష్టికి కేటాయించినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలను అధికారులతో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉ న్నాయని, విద్యార్థులను విహారయాత్రలకు తీసుకెళ్లాలని.. క్రీడలు ఆడించాలని కలెక్టర్కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ విద్యార్థులపై ఆప్యాయత, అనురాగాలతో వ్యవహరించి.. స్వేచ్ఛాయుత వా తావరణంలో విద్యానందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం వి ద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
అదనంగా బస్సులు నడపాలి
దామరగిద్ద, సెప్టెంబర్ 9 : మండలంలో ని కానుకుర్తి నుంచి విద్యార్థులు పై చదువుల నిమిత్తం మండల కేంద్రంతోపాటు, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఒక్కటే బస్సు ఉండడంతో ప్రతి రోజూ ఇ బ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అదనంగా బస్సులు నడిపించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దామరగిద్ద-యానగుంది రోడ్డుపై కానుకుర్తిలో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దాదా పు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ స్తం భించిపోయింది. విషయం తెలుసుకున్న డి పో మేనేజర్ అదనపు సర్వీసులు నడిపించి విద్యార్థుల ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.